Stroke: పక్షవాతం రావడానికి ముందు.. కనిపించే 5 డేంజరస్ సంకేతాలు ఇవే.. నిర్లక్ష్యం చేస్తే మంచానికే పరిమితం!

స్ట్రోక్‌కు ముందు మన బాడీ కొన్ని వార్నింగ్ సైన్స్ ఇస్తుంది. వాటిని ముందుగానే గుర్తిస్తే, పెద్ద ప్రమాదం నుంచి రక్షించుకోవచ్చు.పక్షవాతం (Stroke) అనేది ప్రపంచ వ్యాప్తంగా చాలా మందిని ప్రభావితం చేస్తున్న సీరియస్ మెడికల్ ఎమర్జెన్సీ. అకస్మాత్తుగా వచ్చే ఈ సమస్య కారణంగా చాలా మంది హాస్పిటల్‌కు వెళ్లడం ఆలస్యం అవుతోంది. సరైన టైమ్‌లో వైద్య సహాయం అందకపోతే ప్రాణాలకే ప్రమాదం, శాశ్వత అంగవైకల్యం వచ్చే ఛాన్స్ ఉంది. అయితే, ఇతర జబ్బుల మాదిరిగానే స్ట్రోక్‌కు ముందు మన బాడీ కొన్ని వార్నింగ్ సైన్స్ ఇస్తుంది. వాటిని ముందుగానే గుర్తిస్తే, పెద్ద ప్రమాదం నుంచి రక్షించుకోవచ్చు.స్ట్రోక్ అంటే ఏంటి? స్ట్రోక్ (Stroke) అంటే మెదడులోని ఒక భాగానికి రక్త ప్రసరణ ఆగిపోవడం లేదా బాగా తగ్గిపోవడం. దీని వల్ల బ్రెయిన్ సెల్స్‌కు ఆక్సిజన్ అందదు. అవి డ్యామేజ్ అవుతాయి. ఫలితంగా మెదడులోని ఆ భాగం కంట్రోల్ చేసే బాడీ ఫంక్షన్స్ దెబ్బతింటాయి.స్ట్రోక్‌లో ఇస్కీమిక్ స్ట్రోక్ (బ్లడ్ క్లాట్ కారణంగా), హెమరేజిక్ స్ట్రోక్ (బ్లీడింగ్ కారణంగా) అని రెండు రకాలు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO), అమెరికన్ స్ట్రోక్ అసోసియేషన్ ప్రకారం.. స్ట్రోక్ లక్షణాలను వీలైనంత త్వరగా గుర్తించి, వైద్య సహాయం అందించాలి. దీని వల్ల ప్రాణాలను కాపాడొచ్చు, శాశ్వత అంగవైకల్యం రాకుండా నివారించవచ్చు.ఆ లక్షణాలను నిర్లక్ష్యం చేయొద్దు ఇతర రోగాల మాదిరిగానే స్ట్రోక్‌కు ముందు బాడీలో కొన్ని లక్షణాలు (Stroke Symptoms) ఒక్కసారిగా కనిపిస్తాయి. అవి ఏంటంటే.. భరించలేని తీవ్రమైన తలనొప్పి. ఎప్పుడూ ఇలాంటి అనుభూతి ఫీల్ అవ్వలేదు అని అనిపిస్తుంది. కళ్లు మసకబారడం, డబుల్ విజన్ సమస్య వస్తుంది.ముఖం, చేతులు, కాళ్లలో తిమ్మిరి రావడం, మొద్దుబారడం వంటి ఫీలింగ్ ముఖ్యంగా శరీరంలో ఒక సైడ్‌కు ఎక్కువగా ఉంటుంది. క్లియర్‌గా మాట్లాడలేక పోవడం, మాట తడబడుతుంది. సడెన్‌గా బ్యాలెన్స్ కోల్పోవడం లేక సరిగా నడవడానికి ఇబ్బంది పడతారు. ముఖంలో ఒక సైడ్ కిందికి జారినట్లు అనిపిస్తుంది.బ్రెయిన్ ఎన్యూరిజం ప్రమాదం స్ట్రోక్‌కు (Stroke Symptoms) ముందు వచ్చే హెచ్చరికలను ఎప్పుడూ లైట్ తీసుకోవద్దు. ఈ లక్షణాలు సబ్‌అరక్నాయిడ్ హెమరేజ్ (Subarachnoid Hemorrhage) అనే పరిస్థితికి కూడా సంబంధించినవి కావచ్చు. ఇది ఎక్కువగా బ్రెయిన్ ఎన్యూరిజం (Aneurysm) చిట్లిపోవడం వల్ల వస్తుంది.ఎన్యూరిజం అంటే ధమనుల గోడలు బలహీనంగా మారిన చోట బెలూన్ లాగా ఉబ్బడం. ఇది చిట్లిపోతే మెదడులో బ్లీడింగ్ అవుతుంది. ఎన్యూరిజం చిట్లిపోవడం వల్ల మెడ పట్టేయడం, సడన్‌గా తీవ్రమైన తలనొప్పి, కంటి కదలికల్లో ఇబ్బంది లాంటి లక్షణాలు కనిపిస్తాయి.ఎమర్జెన్సీ స్టెప్స్ ఫాలో అవ్వాలి స్ట్రోక్ లక్షణాలు కనిపిస్తే మెడికల్ ఎమర్జెన్సీ నెంబర్‌కు వెంటనే కాల్ చేయాలి. స్ట్రోక్ వచ్చిన మొదటి గంటను గోల్డెన్ అవర్ అంటారు. ఈ టైమ్‌లో ట్రీట్‌మెంట్ స్టార్ట్ చేస్తే ప్రాణ నష్టం, అంగవైకల్యం రిస్క్ తగ్గుతుంది. స్ట్రోక్ లక్షణాలను గుర్తు పట్టడానికి F.A.S.T. అనే మెథడ్ ఫాలో అవుతారు. ఇది స్ట్రోక్ ఎమర్జెన్సీలో చాలా హెల్ప్ అవుతుంది.
