భక్తుల సేవలకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు.. కాంట్రాక్ట్ ఉద్యోగులకు టీటీడీ వార్నింగ్..!

రుమల తిరుపతి దేవస్థానం కాంట్రాక్టు ఉద్యోగులు విధులను బహిష్కరించి భక్తులకు ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. చర్చల ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించింది. తిరుమల తిరుపతి దేవస్థానం కాంట్రాక్టు ఉద్యోగులు విధులను బహిష్కరించి భక్తులకు ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఉద్యోగుల సమస్యలు చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని, భక్తుల సేవలకు ఆటంకం కలిగించే ప్రయత్నాలను ఎస్మా చట్టంతో అడ్డుకుంటామని స్పష్టం చేసింది.తిరుపతిలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కాంట్రాక్టుల ఆందోళనపై తన వైఖరిని తేల్చేసింది. ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక క్షేత్రంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని, అందుకు ఎవరు ఆటంకం కలిగించినా కఠిన చర్యలు తప్పవని స్పష్టంగా ప్రకటించింది.
కాంట్రాక్టు ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించుకోవడానికి యాజమాన్యం ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉందన్న టీటీడీ తెలిపింది. కానీ భక్తుల సేవలపై ప్రభావం పడితే మాత్రం ఉపేక్షించమని హెచ్చరించింది. తాజాగా కాంట్రాక్టు ఉద్యోగులు విధులను బహిష్కరించి నిరసనలకు దిగే సూచనలు కనిపించడంతో టీటీడీ ఈ హెచ్చరిక చేసింది. పారిశుద్ధ్యం, వైద్య సేవలు వంటి కీలక విభాగాల్లో ఉద్యోగులు చేస్తున్న సేవలు అమూల్యమని గుర్తించిన టీటీడీ, ఈ సేవలకు అంతరాయం కలిగిస్తే ఎస్మా చట్టం అమలు చేస్తామని స్పష్టం చేసింది. ముఖ్యమైన సేవల నిర్వహణ చట్టం (ఎస్మా) టీటీడీలో అమల్లో ఉందని, సమ్మెలు, నిరసనలు చట్టరీత్యా నిషిద్ధమని గుర్తు చేసింది.గతంలో విధులను బహిష్కరించిన వారిని మళ్లీ విధుల్లోకి చేర్చినట్టు గుర్తు చేస్తూ, ఈసారి ఆ అవకాశం ఉండబోదని టీటీడీ తేల్చి చెప్పింది.

ADVERTISEMENT
