16 ఏళ్లకే స్టార్ స్టేటస్, స్టార్ హీరోతో బ్రేకప్.. చివరకు ఫ్రెండ్ భర్తనే బుట్టలో పడేసి పెళ్లి.. ఈ తోపు హీరోయిన్ ఎవరో తెలుసా?
ఒకానొక సమయంలో టాలీవుడ్లో వరుస సినిమాలతో సత్తా చాటింది ఈ ముద్దుగుమ్మ. ఇండస్ట్రీలో యంగ్, స్టార్ హీరోలతో నటించి ఫేమస్ అయింది. చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ, తన మొదటి సినిమాతోనే కుర్రాళ్ళ కలల మహారాణి అయింది.

ఆమెనే హీరోయిన్ హన్సిక. తెలుగుతో పాటు హిందీ, తమిళంలో వరుస చిత్రాల్లో నటించిన ఈ భామ, 16 ఏళ్లకే స్టార్ హీరోయిన్ గా మారింది. హన్సిక చాలా సీరియళ్లలోను, సినిమాల్లోనూ చిన్నతనంలోనే నటించింది. 2001 నుంచే షకలక బూమ్ బూమ్.. హమ్ దో హై.. వంటి సీరియళ్లలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేసింది.
2007లో పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ‘దేశముదురు’ సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్గా పరిచయమైంది. టాలీవుడ్లో మొదటి సినిమాతోనే హిట్ కొట్టడమే కాకుండా తన అందచందాలతో యూత్ ఆడియన్స్ మనకు దోచేసింది.
ఆ తర్వాత 2008లో జూనియర్ ఎన్టీఆర్ తో ‘కంత్రీ’ సినిమా చేసింది హన్సిక. హీరో రామ్‌తో ‘మస్కా’ చిత్రంలో నటించి, ఆ తర్వాత ప్రభాస్ నటించిన ‘బిల్లా’ సినిమాలో ‘ప్రియ’గా గెస్ట్ రోల్లో నటించింది ఈ ముద్దుగుమ్మ. ఆపై కందిరీగ, లాక్కున్నోడు, ఎన్టీఆర్ కథానాయకుడు లాంటి సినిమాల్లో భాగమైంది.
ఒక్క టాలీవుడ్ లో మాత్రమే కాకుండా కోలీవుడ్, శాండిల్ వుడ్ లో కూడా తనకంటూ ఓ ముద్ర వేసుకుంది హన్సిక. అయితే హన్సిక త్వరగా పెరిగేందుకు అప్పట్లో హార్మోన్స్ ఇంజక్షన్స్ తీసుకుందని ప్రచారం నడించింది. అవ్వన్నీ తప్పుడు ప్రచారాలని ఆమె చెప్పింది.
తన అందంతో ఎందరో కుర్రకారు మనసుల్ని ఉర్రూతలూగించిన హన్సిక తను శింభుకే సొంతమని అప్పట్లో ఓపెన్‌గా చెప్పేసింది. తమ గురించి హల్చల్ చేస్తున్న పుకార్లన్నిటికీ ‘మేం లవ్‌లో ఉన్నమాట నిజమే’ అంటూ ఫుల్స్టాప్ పెట్టేసిందీ జంట. కానీ, ఆ బంధం కాస్తా బెడిసికొట్టడంతో తిరిగి సినిమాలపై ఫోకస్ పెట్టింది హన్సిక.
తక్కువ సమయంలోనే వరుస ఆఫర్స్ అందుకున్న ఈ అమ్మడు.. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే 2022 డిసెంబర్ 4న రాజస్థాన్ జైపూర్ లో ముండోటా ఫోర్ట్ ప్యాలస్ లో తన సొంత స్నేహితురాలు మాజీ భర్తనే సోహైల్ ఖతురియాను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత సైతం ఇండస్ట్రీలో పలు సినిమాలు చేస్తూ వస్తోంది.

ప్రస్తుతం భర్తతో కలిసి బిజినెస్ రంగంలో కూడా బిజీగా ఉంది హన్సిక. అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ నిత్యం ఏదోక పోస్ట్ చేస్తోంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తున్న హన్సిక తనకంటూ ఓ సొంత యూట్యూబ్ ఛానెల్ కు నడిపిస్తూ తన అప్డేట్స్ ఇస్తోంది.

News by : V.L
Star status at the age of 16, breakup with a star hero.. finally marrying her friend's husband.. Do you know who this top heroine is?
