వైకుంఠ ద్వారంలో దర్శనమిచ్చిన శ్రీ వేణుగోపాల స్వామి …

బాపట్ల జిల్లా అమర్తులూరు మండలం మోపర్రు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ రుక్మిణిసత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవస్థానంలో శ్రీ విశ్వావసు నామ సంవత్సర పుష్య మాస శుద్ధ ఏకాదశి మంగళవారం అనగా 30 12 2025 నాడు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ముక్కోటి ఏకాదశి ఉత్సవములు ఆలయంలో అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం ఐదు గంటలకు స్వామివారికి విశేషా అర్చన అనంతరం విశేష అలంకరణ ఉత్తర ద్వార దర్శనం గ్రామోత్సవం అనంతరం స్థానిక శ్రీ వేణుగోపాల భక్త మండల వారి చే అనంతరం శ్రీమద్ భగవద్గీత 18 అధ్యాయాలు పారాయణ విష్ణు సహస్రనామ పారాయణ హనుమాన్ చాలీసా పారాయణ విఖనస స్తోత్ర పారాయణ అనంతరం నీరాజనం మంత్రపుష్పం తీర్థ ప్రసాద వినియోగం జరిగినాయి రాత్రి 7 గంటలకు విశేషంగా ఏకాదశి జాగారం కింద 108 ప్రదక్షిణలు స్వామివారి ఆలయం లో నిర్వహించినారు ఈనాటి కార్యక్రమంలో స్థానిక ఆలయ కార్యనిర్వాహ అధికారి శ్రీమతి ఎన్ వి ఎన్ మల్లేశ్వరి గారి ఆధ్వర్యంలో నిర్వహించారు అర్చకులు బృందావనం వరదాచార్యులు మరియు వెంకటరమణ దీక్షితులు వెంకట శేష సాయి వేదాంతం శ్రీనాథ్ తదితరులు పాల్గొని స్వామి వారి యొక్క కైంకర్యములు నిర్వహించినారు భక్తులు అత్యంత ఉత్సాహంతో పాల్గొని స్వామి వారి వైకుంఠ ఏకాదశి కార్యక్రమంలో అత్యంత వైభవంగా విజయవంతంగా నిర్వహించినారు.

