Sri Sampath Vinayagar Temple

శ్రీ సంపత్ వినాయగర్ దేవాలయం విశాఖపట్నం లో ఉన్న దేవాలయం. ఇది విశాఖపట్నం లోని అసీల్ మెట్ట లో ఉంది. ఇక్కడి ప్రధాన దైవం వినాయకుడు.

చరిత్ర

ఈ ఆలయాన్ని 1962 లో టిఎస్ రాజేశ్వరన్, టిఎస్ సెల్వగణేశన్, ఎస్.జి.సంబంధన్ లు నిర్మించారు. ఈ ముగ్గురూ పోర్టులో ట్రాన్స్ పోర్ట్ వ్యాపారం చేసేవారు. వారు తమ వాహనాలకు ఎటువంటి ప్రమాదం కలగకుండా తొలుత ఇక్కడివినాయకుడికి పూజలు నిర్వహించేవారు. 1967లో కంచి పీఠాధిపతి చంద్రశేఖరేంద్ర సరస్వతి ఈ దేవాలయంలో శ్రీ గణపతి యంత్రాన్ని స్థాపించి విగ్రహానికి ప్రాణప్రతిష్ట చేసాడు. 1996లో ఇది ఎంటోమెంట్స్ పరిధిలోకి వచ్చింది.

1971 ఇండో-పాకిస్తాన్ యుద్ధంలో ఈ ఆలయం పి.ఎన్.ఎస్. ఘజీ దాడి నుండి నగరాన్ని రక్షించిందని స్థానిక ప్రజలు ఇప్పటికీ నమ్ముతున్నారు. ఇది విశాఖపట్నం తీరంలో ఆ జలాంతర్గామిని ముంచివేసిందని ఇక్కడి ప్రజల విశ్వాసం. 

విశేషాలు

సంపత్ వినాయగర్ ఆలయం చాలా ప్రాచుర్యం పొందింది. ఈ ప్రాంతంలో, కొత్తగా కొనుగోలు చేసిన ఏదైనా వాహనం యొక్క పూజను నిర్వహించడానికి ప్రజలు ఇప్పటికీ ఇక్కడికి వస్తూంటారు. ఈ ఆలయం నగరంలో అత్యంత రద్దీగా ఉండే ప్రదేశాలలో ఒకటి. ప్రతి సంవత్సరం గణేష్ చతుర్థిని గొప్ప ఆడంబరంగా జరుపుకుంటారు. ప్రజలు దీనిని నగరం యొక్క అదృష్ట దేవాలయంగా నమ్ముతారు.

 







		
		
			

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *