Splendor electric bike at such a low price? But people will be blown away!

హీరో స్ప్లెండర్ (Hero Splendor) పేరు వింటేనే మనసుకు వచ్చే నమ్మకం, సౌకర్యం, సరసమైన ధర అనే మూడు మాటలు. భారతదేశంలోని ప్రతి వీధిలో, ప్రతి గ్రామంలో ఈ బైక్‌ను చూసే అవకాశం ఉంటుంది. ఇది కేవలం ఒక బైక్ మాత్రమే కాదు; లక్షలాది కుటుంబాల జీవన భాగస్వామి. దశబ్దకాల క్రితం మార్కెట్లోకి అడుగు పెట్టిన హీరో స్ప్లెండర్ అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రజాదరణలో ఏ మాత్రం తగ్గలేదు. పట్టణాల్లో ఇది ఆఫీస్ ఉద్యోగుల దినచర్యలో భాగమైపోయింది. తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజ్ ఇచ్చే ఈ బైక్ ఫుడ్ డెలివరీ ఉద్యోగులు, చిన్న వ్యాపారులు, విద్యార్థులు వంటి అనేక వర్గాల ప్రజల జీవితాల్లో ముఖ్యమైన సాధనంగా మారింది.

అంతేకాదు, తక్కువ ఇంధన వినియోగంతో ఎక్కువ పని చేయడం వల్ల గ్రామీణ ప్రజలకు ఆర్థికంగా మేలు చేస్తోంది. దశాబ్దాలుగా నంబర్ వన్ సేల్స్‌ను కొనసాగిస్తున్న హీరో స్ప్లెండర్ ఇప్పుడు కొత్తగా అడుగుపెడుతోంది. ఇంతవరకు పెట్రోల్ ఇంజిన్ ఆధారంగా నడిచే బైక్ ఇప్పుడు భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఎలక్ట్రిక్ వెర్షన్ రూపంలో రాబోతోందని సమాచారం. తక్కువ నిర్వహణ ఖర్చుతో, ఇంకా ఆధునిక డిజైన్‌తో కొత్త స్ప్లెండర్ EV అడుగు పెట్టబోతుందని సమాచారం. హీరో స్ప్లెండర్ ఎలక్ట్రిక్ వెర్షన్‌పై అధికారిక ప్రకటన కంపెనీ నుంచి ఇంకా వెలువడకపోయినప్పటికీ, ఈ బైక్ గురించి ఆసక్తికరమైన సమాచారం బయటకు వస్తోంది. దీనిని 2027 నాటికి దేశీయ మార్కెట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఎప్పటిలాగే సరసమైన ధరతోనే ఈ బైక్ అందుబాటులో ఉండబోతోందని భావిస్తున్నారు. అంచనా ప్రకారం ధర సుమారు రూ.99,000(ఎక్స్-షోరూమ్) వరకు ఉండవచ్చు, ఇది మధ్యతరగతి, ఉద్యోగ వర్గాలకు చాలా అందుబాటులో ఉండే స్థాయిలోనే ఉంది.



		
		
			

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *