గుంటూరు అష్టలక్ష్మీకి విశిష్టపూజలు

రాష్ట్ర వార్త : రెండవ శ్రావణ శుక్రవారం సందర్భంగా ఆలయాలన్ని భక్తులతో కిటకిటలాడాయి. పెద్దఎత్తున మహిళలు పాల్గొని పూజలు నిర్వహించారు.శ్రావణ శుక్రవారం సందర్భంగా గుంటూరులోని ప్రముఖ దేవాలయాలన్ని అమ్మవారి నామస్మరణతో మారుమ్రోగాయి. అరుండల్పేటలోని అష్టలక్ష్మీ దేవాలయంలో తెల్లవారుజాము నుండే భక్తులు పోటెత్తారు. అత్యంత భక్తిశ్రద్ధలతో భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి కుంకుమార్చన, వరలక్ష్మి వత్రాలు చేశారు. అనంతరం సిరులునిచ్చే తల్లి జగన్మాత మమ్మల్ని చల్లగా చూడమని వేడుకున్నారు. పూజ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.

