జ‌న‌వ‌రి – 2026 నెలలో శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు

తిరుపతి, 2025 డిసెంబ‌రు 24: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జ‌న‌వ‌రి నెల‌లో జరుగనున్న విశేష ఉత్సవాల వివరాలు ఇలా ఉన్నాయి.

  • జ‌న‌వ‌రి 1న రోహిణి నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు రుక్మిణి, సత్యభామ సమేత శ్రీపార్థసారధి స్వామి వారు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షిస్తారు.
  • జ‌న‌వ‌రి 2, 23వ తేదీల్లో శుక్రవారం సాయంత్రం 6 గంటలకు శ్రీ ఆండాళ్‌ అమ్మవారు ఆలయ మాడ వీధుల్లో భక్తులను అనుగ్రహిస్తారు.
  • జ‌న‌వ‌రి 3న పౌర్ణ‌మి గ‌రుడ‌సేవ‌
  • జ‌న‌వ‌రి 5న శ్రీ గోవింద‌రాజ‌స్వామివారు రామ‌చంద్ర‌తీర్థ క‌ట్ట‌కు వేంచేపు.
  • జ‌న‌వ‌రి 7 నుండి 13వ తేదీ వ‌ర‌కు శ్రీ ఆండాల్‌ అమ్మవారి నీరాటోత్సవం.
  • జ‌న‌వ‌రి 14న భోగి తేరు.
  • జ‌న‌వ‌రి 15న మ‌క‌ర సంక్రాంతి.
  • జ‌న‌వ‌రి 16న గోదా క‌ల్యాణం
  • జ‌న‌వ‌రి 17న క‌నుమ పండుగ సంద‌ర్భంగా పార్వేటి ఉత్స‌వం.
  • జ‌న‌వ‌రి 18 నుండి ఫిబ్ర‌వ‌రి 10వ తేదీ వ‌ర‌కు అధ్యయనోత్సవాలు
  • జ‌న‌వ‌రి 20న శ్ర‌వ‌ణా నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు ఉభయనాంచారులతో కలిసి శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి నాలుగు మాడ వీధుల్లో భక్తులను అనుగ్రహిస్తారు.
  • జ‌న‌వ‌రి 25న ర‌థ‌స‌ప్త‌మి.
  • జ‌న‌వ‌రి 27 నుండి ఫిబ్ర‌వ‌రి 1వ తేదీ వ‌ర‌కు తెప్పోత్స‌వాలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top