Snakes: పెద్ద తలలు ఉన్న రాకాసి పాములు.. ఇవి కాటేస్తే క్షణాల్లో పోతారు.. పొరపాటున కూడా దీనికి ఎదురు పడొద్దు!

Snakes: కొన్ని జాతుల పాములకు చాలా పెద్ద తలలు ఉంటాయి. ఈ భారీ తలలే వాటికి రక్షణగా పనిచేస్తాయి.ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాల్లో పాములు ఉంటాయి. భూమిపై 3,000 పైగా పాముల జాతులు ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వీటిల్లో కొన్ని చాలా పొడవుగా ఉంటాయి. మరికొన్ని సన్నగా పొట్టిగా ఉంటాయి. ఇంకొన్నింటికి చాలా పెద్ద తలలు ఉంటాయి. ఈ భారీ తలలే వాటికి రక్షణగా పనిచేస్తాయి. శత్రువుల నుంచి కాపాడుకోవడానికి వేటాడటానికి ఈ పెద్ద తలలు (Large head snakes) వాటికి చాలా ఉపయోగపడతాయి. భూమిపై నివసించే అలాంటి 10 భారీ తల పాముల గురించి తెలుసుకుందాం. ఇందులో విషపూరితమైనవి, విషం లేనివీ ఉన్నాయి.కింగ్ కోబ్రా
ఈ పాము (King Cobra) తల చాలా పెద్దగా, బల్కీగా ఉంటుంది. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద విషపూరిత పాము. దీని తలలో శక్తిమంతమైన విష గ్రంథులు ఉంటాయి. అందుకే దీని తల అంత పెద్దగా ఉంటుంది. ప్రమాదం అనిపిస్తే దీని తల చుట్టూ ఉన్న పడగను వెడల్పు చేస్తుంది.గ్యాబూన్ వైపర్
ఈ పాము (Gaboon Viper) తల 5 అంగుళాల వెడల్పు వరకు ఉంటుంది. ప్రపంచంలోనే అతి పెద్ద తల ఉన్న పాము ఇదే. దీని తల పెద్దదిగా ఉండటం కారణంగా ఇది ఎక్కువ విషాన్ని నిల్వ చేసుకోగలదు. వేగంగా, శక్తిమంతంగా తన ఆహారంపై లేదా శత్రువుపై దాడి చేయగలదు.
రైనోసార్స్ వైపర్
ఈ పాము (Rhinoceros Viper) ముక్కుపై కొమ్ముల్లాంటివి ఉంటాయి. దీని తల వెడల్పుగా, త్రిభుజాకారంలో ఉంటుంది. అందుకే దీనికి ఆ పేరు వచ్చింది. ఈ పెద్ద తల కారణంగా ఇది బాగా వేటాడగలదు. దీని విషం చాలా పవర్‌ఫుల్.

