Smart TV Offers: రూ.లక్షా 20 వేల 65 ఇంచుల పెద్ద స్మార్ట్‌టీవీ.. ఇప్పుడు రూ.30 వేలకే కొనేయండి!

స్మార్ట్‌టీవీ కొనే వారికి మతిపోయే ఆఫర్ అందుబాటులోకి వచ్చింది. భారీ డిస్కౌంట్‌తో అదిరే టీవీని కొనొచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ డీల్ అందుబాటులో ఉంది. మీరు కొత్త స్మార్ట్‌టీవీ కొనే ప్లానింగ్‌లో ఉన్నారా.. అయితే మీకు ఇది మంచి ఛాన్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే భారీ డిస్కౌంట్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. కళ్లుచెదిరే డీల్స్ లభిస్తున్నాయి. ఫ్లాట్ డిస్కౌంట్, క్రెడిట్ కార్డు ఆఫర్లు, ఎక్స్చేంజ్ డీల్స్ వంటి వాటితో దుమ్మురేపే డీల్స్ లభిస్తున్నాయి. అందువల్ల మీరు పెద్ద టీవీ కొనే యోచనలో ఉంటే మాత్రం ఈ సూపర్ ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు. దిగ్గజ ఈకామర్స్ సంస్థల్లో ఒకటిగా కొనసాగుతూ వస్తున్న ఫ్లిప్‌కార్ట్‌లో సేల్ నడుస్తోంది. ఇందులో భాగంగా స్మార్ట్ టీవీలపై భారీ తగ్గింపు ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. రూ.లక్షకు పైగా ఖరీదైన స్మార్ట్ టీవీ ఇప్పుడు మీరు కేవలం రూ. 30 వేల బడ్జెట్లోనే కొనుగోలు చేయొచ్చు. అంటే ఏ స్థాయిలో తగ్గింపు అందుబాటులో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ ఆ ఆఫర్ ఏంటి? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. టీసీఎల్ కంపెనీకి చెందిన ఐఫాల్కన్ బ్రాండ్ 65 ఇంచుల స్మార్ట్ టీవీపై భారీ తగ్గింపు ఉంది. ఇది 2025 ఎడిషన్ 4కే గూగుల్ టీవీ. ఈ స్మార్ట్ టీవీ అసలు ధర రూ. 1,20,990. అయితే మీరు ఇప్పుడు సేల్‌లో ఈ టీవీని రూ. 41,999కు కొనుగోలు చేయొచ్చు. అంటే మీరు నేరుగానే 65 శాతం వరకు తగ్గింపు అందుబాటులో ఉందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ స్మార్ట్ టీవీపై ఎక్స్చేంజ్ డీల్స్ కూడా ఉన్నాయి. ఏకంగా రూ. 7,900 వరకు తగ్గింపు వస్తుంది. అయితే ఇక్కడ ఎక్స్చేంజ్ విలువ అనేది మీ పాత టీవీ ఆధారంగా మారుతూ ఉంటుంది. అన్ని టీవీలకే ఒకే రేటు వర్తించదు. అందువల్ల ఎక్స్చేంజ్ డీల్ విలువ అనే మారుతుందని గుర్తు పెట్టుకోవాలి. ఇంకా పలు పిన్‌కోడ్స్‌కు మాత్రమే ఈ ఎక్సేంజ్ డీల్ అందుబాటులో ఉంటుంది. అన్ని ఏరియాల్లో ఈ సదుపాయం ఉండదు. అంతేకాకుండా క్రెడిట్ కార్డు ఆఫర్లు కూడా ఉన్నాయి. ఏకంగా ఏకంగా రూ.8 వేల వరకు డిస్కౌంట్ సొంతం చేసుకోవచ్చు. ఈ ఆఫర్ కూడా మీ క్రెడిట్ కార్డు ఆధారంగా మారుతుంది. అంటే ఒక్కో బ్యాంక్ క్రెడిట్ కార్డుపై ఒక్కో రకమైన ఆఫర్ ఉండొచ్చు. ఇంకా ఈఎంఐలో కొంటే అదనపు తగ్గింపు కూడా వస్తుంది. అందుకే ఈ విషయాన్ని కూడా గమనించాలి. అంటే అప్పుడు ఎక్స్చంజ్ ఆఫర్, క్రెడిట్ కార్డు డిస్కౌంట్ కలుపుకుంటే మీరు రూ.30 వేల బడ్జెట్లోనే ఈ పెద్ద స్మార్ట్ టీవీని కొనుగోలు చేయొచ్చు. ఇది కళ్లుచెదిరే డీల్ అని చెప్పుకోవచ్చు. అందువల్ల మీరు మీ ఇంట్లో స్మార్ట్ టీవీ పెట్టుకోవాలని భావిస్తే.. ఈ ఆఫర్‌ను ఒకసారి పరిశీలించొచ్చు.

