Skill Development: యువతకు గుడ్న్యూస్.. చేతి నిండా డబ్బు సంపాదించే అవకాశం.. ఉచిత శిక్షణ కార్యక్రమం..

యూనియన్ బ్యాంక్ RSETI ఆధ్వర్యంలో శ్రీకాకుళం యువతకు ఉచిత శిక్షణ, ఫోటోగ్రఫీ, మొబైల్ సర్వీసింగ్ నైపుణ్యాలు, 2025 అక్టోబర్ 6 నుంచి ఎచ్చెర్లలో ప్రారంభం.యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం నేటి సమాజంలో అత్యవసరం. నిరుద్యోగం సమస్యను ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో, వివిధ రంగాల్లో ఉచిత శిక్షణా కార్యక్రమాలను అందించడం ద్వారా యువతకు కొత్త మార్గాలు తెరుస్తున్నాయి. యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో నడుస్తున్న గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ (RSETI) ఇలాంటి అద్భుతమైన అవకాశాలను అందిస్తోంది. ఈ కార్యక్రమం 2025 అక్టోబర్ 6 నుంచి ప్రారంభమవుతుంది. శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్లలో ఉన్న MRO ఆఫీసు రోడ్డున ఈ శిక్షణా తరగతులు జరగనున్నాయి. శిక్షణ పూర్తిగా ఉచితంగా అందించబడుతుంది. పాల్గొనేవారికి వసతి, భోజనం, శిక్షణ అన్నీ ఉచితంగానే ఉంటాయి.ఈ కోర్సులో ఆధునిక ఫోటోగ్రఫీ నైపుణ్యాలను నేర్పిస్తారు. ముఖ్యంగా ఫోటో ఎడిటింగ్, వీడియో మిక్సింగ్, ఆల్బమ్ క్రియోషన్, డ్రోన్ ఆపరేటింగ్. నేటి డిజిటల్ యుగంలో పెళ్లిళ్లు, ఈవెంట్లు, ఫంక్షన్లు వంటి ప్రతి కార్యక్రమంలో వీడియోగ్రాఫర్లకు మంచి డిమాండ్ ఉంది. ఈ శిక్షణ పొందినవారు సులభంగా స్వయం ఉపాధి దారులను ఏర్పరచుకోవచ్చు.స్మార్ట్‌ఫోన్లు మన జీవితంలో అంతర్భాగమైపోయాయి. వాటికి వచ్చే సమస్యలు రోజువారీ అవసరాలే. ఈ కోర్సులో యువతకు ఫోన్, ప్రాబ్లమ్ ట్రబుల్ షూటింగ్, బేసిక్ ఎలక్ట్రానిక్ కంపోనెంట్స్ తనిఖీ పద్ధతులు, హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ సమస్యలు పరిష్కరించే విధానాలు, కాంబో రిమూవింగ్ & రీప్లేస్‌మెంట్ టెక్నిక్, డెడ్ మొబైల్ ఫోన్లను చెక్ చేయడం, వంటి నైపుణ్యాలను నేర్పిస్తారు. దీని ద్వారా యువత సొంతంగా సర్వీసింగ్ సెంటర్ ప్రారంభించి ఉపాధి పొందవచ్చు.
ఈ శిక్షణ కార్యక్రమం 30 రోజులపాటు కొనసాగుతుంది. కేవలం ఒక నెలలోనే వృత్తి పరంగా కొత్త దారులు తెరుచుకునేలా శిక్షణా రూపకల్పన చేశారు. అర్హతలు: 19 నుంచి 45 సంవత్సరాలు వయసు ఉండాలి విద్యార్హత కనీసం 10వ తరగతి ఉత్తీర్ణత, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా యువకులు మాత్రమే ఈ అవకాశాన్ని పొందగలరు.యూనియన్ బ్యాంక్ RSETI చేపడుతున్న ఈ ఉచిత శిక్షణా కార్యక్రమం శ్రీకాకుళం యువతకు ఒక అద్భుతమైన అవకాశం. ఆసక్తి గల వారు 9553410809, 7702180537 ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తమ భవిష్యత్తుకు కొత్త మార్గాలను సృష్టించుకోవాలి. ఉద్యోగం కోసం వెతకడం కంటే, ఉపాధి సృష్టించడం గొప్పది అనే నానుడిని నేటి తరానికి ఈ శిక్షణ జీవంగా చూపిస్తుంది.

