చలికాలంలో కాలి వేళ్ల మధ్య వచ్చే దురద, మంటను తగ్గించే సింపుల్ చిట్కాలు, ఎక్స్పర్ట్ చెప్పినట్టు పాటిస్తే అంతా క్లియర్

చలికాలం వచ్చిందంటే.. చాలా మందికి చేతులు, ముఖ్యంగా కాలి వేళ్లు లేదా మధ్యలో వాపు, దురద వస్తుంది. ఈ పరిస్థితిని చిల్బ్లెయిన్స్ అంటారు నిపుణులు. ఇది తరచుగా తీవ్రమైన చలికి గురికావడం వల్ల వస్తుంది. మీరు చలికాలంలో ఈ సమస్యను ఎదుర్కొంటుంటే.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రముఖ డైటీషియన్ ఈ పరిస్థితిని నివారించడానికి కొన్ని సింపుల్ చిట్కాలు చెప్పారు. ఆ చిట్కాలేంటో ఇప్పుడు చుద్దాం.
చలికాలంలో రోజు రోజుకి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. శీతాకాలం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అయితే, ఈ సీజన్ ఆహ్లాదకరంగా ఉండటంతో పాటు అనేక అనారోగ్యాల్ని తీసుకువస్తుంది. శీతాకాలంలో చిల్బ్లెయిన్స్ సమస్య చాలా మందిని వేధిస్తుంది. చిల్బ్లెయిన్స్ అంటే ఏదో అనుకోకండి. చేతి, కాలి వేళ్లు ఎర్రగా మారడం, వేళ్ల మధ్య దురద, మంట అనిపించడం. ఈ పరిస్థితి ఇబ్బందికరంగా ఉంటుంది.
చలి పెరిగేకొద్దీ ఈ పరిస్థితి తీవ్రంగా ఉంటుంది. చిల్బ్లెయిన్స్ దురద, ఎర్రటి మచ్చలు, చేతులు, కాళ్ళపై వాపుకు కారణమవుతాయి. ఇది నయం కావడానికి 2-3 వారాలు పడుతుంది. శీతాకాలంలో ఈ సమస్య చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ సమస్యతో బాధపడుతున్నవారికి ప్రముఖ డైటీషియన్ లవ్లీన్ కౌర్ కొన్ని చిట్కాల్ని షేర్ చేశారు. ఈ చిట్కాలు సులభంగా ఉంటాయి. వీటిని పాటిస్తే సులభంగా చిల్బ్లెయిన్స్ సమస్యను తగ్గించుకోవచ్చు. ఆ పూర్తి వివరాలపై ఓ లుక్కేద్దాం.
చలి వాతావరణంలో కాలి వేళ్లు, చేతి వేళ్లలోని రక్త నాళాలు సంకోచించి.. సరైన రక్త ప్రసరణకు ఆటంకం కలిగించినప్పుడు చిల్బ్లెయిన్స్ వస్తాయని ఎక్స్పర్ట్ డైటీషియన్ లవ్లీన్ కౌర్ అంటున్నారు. మీరు వెచ్చని వాతావరణంలోకి వచ్చినప్పుడు, ఈ రక్త నాళాలు మళ్లీ విస్తరిస్తాయి. దీని వలన దురద, ఎరుపు, వాపు సమస్యలు ఇంకా ఎక్కువ అవుతాయని ఆమె హెచ్చరిస్తున్నారు

- చల్లిని వాతావరణం: చల్లిని, తేమతో కూడిన ప్రదేశాలకు గురికాడం వల్ల చిల్బ్లెయిన్స్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి.
- సున్నితమైన చర్మం: చాలా మంది సున్నితమైన చర్మంతో బాధపడతారు. అలాంటివారికి ఈ సమస్య వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది
- రక్త ప్రసరణ సరిగా లేకపోవడం: శరీరంలో సరైన రక్త ప్రసరణ లేకపోతే.. చిల్బ్లెయిన్స్ సమస్య రావచ్చు.
- బిగుతుగా ఉండే దుస్తులు: బిగుతుగా ఉండే షూస్, చేతి గ్లౌవ్స్ ధరించడం వల్ల చేతులు, కాళ్ళలో రక్త ప్రసరణ దెబ్బతింటుంది. ఇది చిల్బ్లెయిన్స్ ప్రమాదాన్ని పెంచుతుంది.
- ధూమపానం: స్మోకింగ్ రక్త నాళాల్ని మంరిత కుంచించుకుపోయేలా చేస్తుంది. చిల్బ్లెయిన్స్ ప్రమాదాన్ని పెంచుతుంది.

Simple tips to reduce itching and burning between the toes in winter, everything will be clear if you follow the expert's advice
