భుజం నొప్పి.. ఫ్రోజెన్ షోల్డర్ కు ఉపశమనం కోసం ఇలా చెయ్యండి!

చాలామంది ఎదుర్కొంటున్న సమస్య ఫ్రోజెన్ షోల్డర్. భుజం కీళ్ళు గట్టిపడటం వల్ల చెయ్యి పైకి లేపలేని, నొప్పితో తెగ బాధ పడే పరిస్థితి ఈ ఫ్రోజెన్ షోల్డర్ కు ఉంటుంది. ఇది దేశవ్యాప్తంగా అనేక మందిని ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా ఇది డయాబెటిస్ బాధితులలో కనిపిస్తుంది. అయితే ఫ్రోజెన్ షోల్డర్ నొప్పిని తగ్గించుకోవడానికి కొన్ని చిట్కాలు బాగా పనిచేస్తాయి. మనం ఇంట్లోనే చేసుకోగలిగిన చిట్కాలు ఏంటి అనేది తెలుసుకుందాం.
ఫ్రోజెన్ షోల్డర్ సమస్యలో భుజం క్యాప్సూల్స్ మంద పడి బిగుతుగా మారుతుంది. ఇది భుజం కదలికలను నియంత్రిస్తుంది. అసౌకర్యాన్ని కలిగిస్తుంది. 40 నుండి 60 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తులలో ఇది సాధారణంగా కనిపిస్తుంది. ఈ ఫ్రోజెన్ షోల్డర్ సమస్య కొన్ని నెలలు లేదా కొన్ని సంవత్సరాల పాటు కొనసాగుతుంది. ఈ సమస్యను ముందుగా ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి.
ఫ్రోజెన్ షోల్డర్ ఉపశమనానికి ఇంటి చిట్కాలు ఫ్రోజెన్ షోల్డర్ సమస్య తగ్గడానికి మనం ఇంట్లోనే చేయగలిగిన కొన్ని చిట్కాలు ఉన్నాయి. హీట్ ప్యాడ్ ను ఉపయోగించడం , సున్నితమైన స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయటం భుజం మొబిలిటీ ని మెరుగుపరచడంలో సహాయపడతాయి ఇవి క్రమం తప్పకుండా చేయడం వల్ల నొప్పి నుండి కాస్త ఉపశమనం కలుగుతుంది.
ఇవి తీసుకుంటే కూడా ఫ్రోజెన్ షోల్డర్ పసుపు వేసుకున్న వేడి వేడి పాలు తాగడం వల్ల కూడా ఫ్రోజెన్ షోల్డర్ ను నివారించవచ్చు. పసుపును పేస్టులా చేసి ఫ్రోజెన్ షోల్డర్ కు రాసిన కాస్త ఉపశమనం కలుగుతుంది. అల్లం టీ తాగడం వల్ల కూడా ఫ్రోజెన్ షోల్డర్ నుంచి కాస్త రిలీఫ్ లభిస్తుంది. అంతేకాదు మనం మంచి ఆహారాన్ని తినడం వల్ల, సమతుల్య ఆహారం కీళ్ల ఆరోగ్యానికి మద్దతు ఇచ్చి ఫ్రోజెన్ షోల్డర్ ను తగ్గిస్తుంది.
వీటితో ఫ్రోజెన్ షోల్డర్ నుండి ఉపశమనం ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ తో ఉన్న ఆహారాలను తినడం ఫ్రోజెన్ షోల్డర్ కు ఉపశమనాన్ని కలిగిస్తుంది. శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడం కూడా ఫ్రోజెన్ షోల్డర్ ను తగ్గిస్తుంది. ఇక వీటితో మాత్రమే కాకుండా ఫిజియోథెరపీ చేయించడం, వైద్యులను సంప్రదించి సరైన వైద్యాన్ని తీసుకోవడం కూడా ఫ్రోజెన్ షోల్డర్ కు అవసరం. ఇక ఫ్రోజెన్ షోల్డర్ సమస్య మరీ ఎక్కువగా బాధించకుండా ఉండాలంటే ప్రతిరోజు సున్నితమైన వ్యాయామాలను తప్పకుండా చేయాలి. మంచి ఆహారాలను తీసుకోవాలి.

