Sexual Health: శృంగారం కోసం ఈ మందులు వాడుతున్నారా ? అంతే సంగతులు .. ఎలాంటి నష్టాలు ఉంటాయంటే..?

కొన్ని రకాల మెడిసిన్స్ (Medicines )వ్యక్తుల సెక్సువల్ హెల్త్‌ను, శృంగారాన్ని ఆస్వాదించే సమయాన్ని (Libido) తగ్గిస్తున్నాయని వైద్య నిపుణులు గుర్తించారు. ఫలితంగా ఈ డ్రగ్స్ బాధితులపై శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతాయని హెచ్చరిస్తున్నారు. వైద్య నిపుణుల ప్రకారం.వైద్యుల సలహా తీసుకోకుండా సొంతంగా మందులు వాడేవారు అనేక సమస్యల బారిన పడుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా కొన్ని రకాల మెడిసిన్స్ వ్యక్తుల సెక్సువల్ హెల్త్‌ను, శృంగారాన్ని ఆస్వాదించే సమయాన్ని (Libido) తగ్గిస్తున్నాయని వైద్య నిపుణులు గుర్తించారు. ఫలితంగా ఈడ్రగ్స్(Drugs) బాధితులపై శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతాయని హెచ్చరిస్తున్నారు. వైద్య నిపుణుల ప్రకారం..సెక్స్(Sex) డ్రైవ్ లేదా లిబిడోపై ప్రతికూల ప్రభావం చూపే ఏడు రకాల మందులు ఇవే..
పెయిన్‌కిల్లర్లు
పెయిన్‌కిల్లర్లలో అనేక రకాలు ఉంటాయి. ఎలాంటి నొప్పినైనా దూరం చేయగలిగే శక్తి వీటికి ఉంటుంది. అయితే పెయిన్‌కిల్లర్ల(Pain killer)వాడకం పెరిగితే, సెక్సువల్ స్ట్రెన్త్ తగ్గుతుందని పరిశోధనల్లో తేలింది. పురుషులు, స్త్రీలలో లైంగిక సామర్థ్యాన్ని ప్రభావితం చేసే సెక్సువల్ హార్మోన్ల ఉత్పత్తిని ఈ మందులు తగ్గించడమే ఇందుకు ప్రధాన కారణం. అందుకే వైద్యుల సలహా ప్రకారం, అవసరమైన మోతాదులోనే వీటిని వాడాలి.
యాంటీ డిప్రెసెంట్స్
డిప్రెషన్‌కు చికిత్స చేయడానికి ఈ మందులను ఉపయోగిస్తారు. అయితే వీటిని లిబిడో కిల్లర్స్ అని పిలుస్తారు. సెక్స్‌పై ఆసక్తి కోల్పోవడం, భావప్రాప్తి కలగకపోవడం, స్ఖలన సమస్యలు, కొన్నిసార్లు అస్సలు స్ఖలనం కాకపోవడం, పురుషులలో అంగస్తంభన లోపం.. వంటివి యాంటీ డిప్రెసెంట్స్ వల్ల ఎదురయ్యే సెక్సువల్ సమస్యలు.

