Sex is a good exercise.. Many people lack maturity!!

ఇలియానా.. సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. 2006లో ‘దేవదాస్‌’ సినిమా ద్వారా తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టారు. తరువాత ‘పోకిరి’, ‘జల్సా’, ‘కిక్’, ‘జులాయి’ వంటి వరుస హిట్ చిత్రాల్లో నటించి టాప్ హీరోయిన్‌గా ఎదిగారు. చివరగా 2018లో రవితేజతో కలిసి ‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’ చిత్రంలో కనిపించింది. అలానే హిందీ చిత్రాల్లో కూడా నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. ‘దో ఔర్‌ దో ప్యార్’, ‘బర్బార్ దేఖో’, ‘పఘలెట్’ వంటి సినిమాల్లో నటించారు. ప్రస్తుతం ఆమె సినిమాలకు దూరంగా ఉంటుంది ఈ భామ.

ముంబైలో ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తూ.. తన చిన్నారితో కలిసి ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతుంది ఈ గోవా బ్యూటీ. అలానే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఇలియానా తరచుగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఫోటోలు, అనుభవాలను అభిమానులతో పంచుకుంటుంది. గతంలో ఇలియానా చేసిన కొన్ని బోల్డ్ వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఫిట్‌నెస్, వ్యాయామం గురించి మాట్లాడుతూ ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

ఆమె మాట్లాడుతూ.. బాడీ మేకోవర్ కోసం చాలా కష్టపడాలని తెలిపింది. ప్రతిరోజూ వ్యాయామం చేయాల్సిందేనని.. కొన్ని సార్లు శృంగారం కూడా మంచి వ్యాయామంలా పనిచేస్తుందని అన్నారు. అందులోనూ అలసిపోతాం కాబట్టి శరీరానికి మంచిదేనని వివరించింది. కష్టపడి చేసే ఏ పని అయినా మన బాడీకి మంచిదే అని.. కానీ కొందరు ఈ విషయాన్ని అర్థం చేసుకోలేరని వివరించింది. మెచ్యూరిటీతో ఆలోచిస్తే ఏదైనా కరెక్ట్ గా అర్థం అవుతుందని చెప్పుకొచ్చింది.

కాగా ఇలియానా 2023 మేలో మైఖేల్‌ డోలన్‌, ఇలియానా డీక్రూజ్‌ రహస్యంగా వివాహం చేసుకున్నారు. కొన్నాళ్ల డేటింగ్ అనంతరం వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. 2023 ఆగస్టులో ఇలియానా మొదటి బిడ్డకు జన్మనిచ్చారు. అతడికి ‘కోవా ఫీనిక్స్ డోలన్‌’గా నామకరణం చేశారు. 2 సంవత్సరాల తర్వాత ఇప్పుడు రెండో బిడ్డకు ఇలియానా జన్మనిచ్చారు. రెండో బిడ్డకి ‘కియాను రఫే డోలన్‌’ అని పేరు పెట్టారు.



		
		
			

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *