Salman Khan: ఓర్నాయనో, సల్మాన్ ఖాన్‌కి ఇంత భయంకరమైన వ్యాధి ఉందా? బయటకొచ్చిన షాకింగ్ సీక్రెట్

స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌కి ఓ భయంకరమైన వ్యాధి ఉందట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా రివీల్ చేశారు.స్టార్ హీరోల్లో కండల వీరుడు అనగానే ఠకీమని గుర్తొచ్చేది సల్మాన్ ఖాన్. హీరోగానే కాదు తన బాడీ బిల్డింగ్ తో కూడా ఫేమస్ అయ్యారు బాలీవుడ్ స్టార్ సల్మాన్. ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చిన ఈ హీరో నిజ జీవితంలో మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నారట. ఆయనకు ఓ భయంకరమైన వ్యాధి ఉందట. ఇది ఆయనే స్వయంగా రిలీవ్ చేశారు.ఓ తీవ్రమైన నొప్పితో చాలాకాలంగా పోరాడుతున్నారట సల్మాన్ ఖాన్. ఈ విషయాన్ని సల్మాన్ ఇటీవల ఓ ప్రోగ్రాంలో బహిరంగంగా చెబుతూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ట్వింకిల్ ఖన్నా, కాజోల్ కలిసి నిర్వహిస్తున్న “టూ మచ్ విత్ ట్వింకిల్ అండ్ కాజోల్” అనే టాక్ షోకు సల్మాన్ అతిథిగా వెళ్ళారు. అక్కడ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు పంచుకున్నారు.“నేను చాలా రోజులుగా ట్రైజెమినల్ న్యూరల్జియా అనే అరుదైన నరాల వ్యాధితో చాలా సంవత్సరాలుగా బాధపడుతున్నాను” అని తెలిపారు సల్మాన్ ఖాన్. ఈ వ్యాధి ముఖంలో ఉన్న నరాలను దెబ్బతీస్తుంది. దీంతో ముఖం మీద ఒక్కసారిగా వచ్చే గుచ్చే నొప్పి వస్తుంది.బ్రష్ చేయడం, తినడం, మాట్లాడటం లాంటి చిన్న పనులు కూడా భరించలేని నొప్పిని కలిగిస్తాయి. “ఆ నొప్పి వల్ల కొన్నిసార్లు బ్రతకాలని అనిపించదు. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన కూడా వచ్చేది” అని సల్మాన్ చెప్పడం ఆశ్చర్యకరం.మరోవైపు ఆయన కెరీర్ కూడా ఇటీవలి కాలంలో పెద్దగా సక్సెస్ కావడం లేదు. షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ చిత్రంలో చిన్న పాత్రలో కనిపించినప్పటికీ, హీరోగా నటించిన సికిందర్ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. ప్రస్తుతం గాల్వన్ అనే మరో చిత్రంలో నటిస్తున్నారు.ఈ పరిస్థితుల్లో కూడా తన ఆరోగ్య సమస్యను ధైర్యంగా చెప్పినందుకు సల్మాన్‌కు అభిమానులు, సినీ ప్రముఖులు మద్దతు తెలుపుతున్నారు. తెరపై ఎంత బలంగా కనిపించినా, మనుషులందరికీ తమ తమ బాధలు ఉంటాయని ఆయన ఉదాహరణగా చూపించారు. తన అనుభవాన్ని పంచుకోవడం ద్వారా ఇలాంటి వ్యాధితో బాధపడుతున్న వారికి ధైర్యం ఇచ్చినట్లు అయింది.
