Rukmini Vasanth: Rukmini Vasanth is mesmerizing with her beauty.. How much did she earn for the movie Kantara Chapter 1..

ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో మారుమోగుతున్న పేరు రుక్మిణి వసంత్. మొన్నటి వరకు ఒకటి రెండు చిత్రాలతో అడియన్స్ ముందుకు వచ్చిన ఈ అమ్మడు.. ఇప్పుడు బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ అందుకుంటుంది. ఇప్పుడు ఆమె నటించిన కాంతార చాప్టర్ 1 మూవీ థియేటర్లలో భారీ విజయాన్ని అందుకుంది. రుక్మిణి వసంత్..ఇప్పుడు సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ కన్నడ భామ.. ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉంది. సప్త సాగరాలు దాటి సినిమాతో ఒక్కసారిగా ఫేమస్ అయిన ఈ అమ్మడు ఇప్పుడు తెలుగులోనూ నటిస్తుంది. తాజాగా ఈ అమ్మడు నటించిన లేటేస్ట్ మూవీ కాంతార చాప్టర్ 1. రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ మూవీ ఇప్పుడు థియేటర్లలో విజయవంతంగా దూసుకుపోతుంది. రెండు రోజుల్లోనే రూ. 100 కోట్లకు పైగా వసూల్లు రాబట్టింది. ఇక ఈ సినిమాలో అందం, అభినయంతో స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది రుక్మిణి. ఇందులో యువరాణి పాత్రలో తన నటనతో కట్టిపడేసింది. తాజాగా ఈ అమ్మడు లేటేస్ట్ ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. కాంతార చాప్టర్ 1 సినిమాతో ఈ అమ్మడ పేరు మారుమోగుతుంది. ఇటీవలే శివకార్తికేయన్ సరసన మదరాసి చిత్రంలో నటించింది రుక్మిణి.ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగుతోపాటు కన్నడ, తమిళంలో వరుస అవకాశాలు అందుకుంటుంది. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న డ్రాగన్ చిత్రంలో ఈ అమ్మడు నటిస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మరోవైపు ఒక్కో సినిమాకు ఈ బ్యూటీ భారీగానే పారితోషికం తీసుకుంటుంది.ఇదిలా ఉంటే.. ఈ సినిమా కోసం రుక్మిణి వసంత్ ఏకంగా రూ.1 కోటి పారితోషికం తీసుకుందని సమాచారం. అలాగే రిషబ్ శెట్టి ఎలాంటి పారితోషికం తీసుకోలేదని టాక్. ప్రస్తుతం ఈ అమ్మడు లేటేస్ట్ ఫోటోస్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి.



		
		
			

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *