షుగర్‌ని తగ్గేంచే రోటీలు, రెగ్యులర్ రోటీల కంటే వీటిని తింటే డయాబెటిస్ కంట్రోల్‌లో ఉంటుంది

షుగర్.. ఇప్పుడు చాలా మందిని వేధించే సమస్యల్లో ఈ ప్రాబ్లమ్ కూడా ఒకటి. దీనిని ఎప్పటికప్పుడు కంట్రోల్‌లో ఉంచుకోవడం మంచిది. దీనికోసం కొన్ని డైట్‌ఫుడ్స్ తీసుకోవాలి. అవేంటో తెలుసుకోండి. డయాబెటిస్ అనేది రక్తంలో గ్లూకోజ్ లెవల్స్ పెరిగినప్పుడు వచ్చే సమస్య. దీనినే షుగర్ అని కూడా అంటారు. దీంతో ఇన్సులిన్ అనే హార్మోన్ తగినంతగా ఉత్పత్తి కాదు. లేదా శరీరం ఇన్సులిన్‌ని సరిగ్గా ఉపయోగించలేకపోవడం వల్ల సమస్య వస్తుంది. ప్రాబ్లమ్ వచ్చినప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా, డైట్ విషయంలో చాలా కేరింగ్‌గా ఉండాలి. సరైన ఫుడ్ తీసుకోవాలి. ప్రాబ్లమ్‌ని తగ్గించేందుకు చాలా మంది రోటీలు తింటారు. ఇది మంచిదే. కానీ, రోటీలను తీసుకున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందుకోసం కొన్ని ప్రత్యేకమైన రోటీల గురించి షేర్ చేసుకుంటున్నారు నీల్ సవాలియా. వాటిని తినడం వల్ల కలిగే లాభాలేంటో తెలుసుకోండి.శనగపిండిలో ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. వీటి వల్ల బ్లడ్ షుగర్ పెరగకుండా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల కఫ దోషానికి ఈ పిండి చాలా మంచిది. వీటితో పాటు మెటబాలిజం పెరిగి బరువు తగ్గుతారు. కాబట్టి, బరువు తగ్గాలనుకునేవారు ఈ రొట్టెల్ని ఏంచక్కా ఎంజాయ్ చేయొచ్చు.
జొన్న రొట్టెలు గ్లూటెన్ ఫ్రీ, శరీరాన్ని శాంతపరుస్తుంది. జొన్నల్ని తినడం వల్ల షుగర్ స్పైక్స్ కంట్రోల్ అవుతాయి. పైగా లివర్ పనితీరు మెరుగ్గా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల పిత్త దోశం బ్యాలెన్స్ అవుతుంది. జొన్నల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండడం వల్ల గ్లూకోజ్ లెవల్స్ కంట్రోల్‌లోనే ఉంటాయి. ముఖ్యంగా ఇన్సులిన్, ట్యాబ్లెట్స్ తీసుకునేవారిలో సమస్యలు తగ్గుతాయి. జొన్నల్లో పీచుపదార్థం ఎక్కువగా ఉండడం వల్ల త్వరగా ఆకలి వేయదని చెబుతున్నారు. వీటిని కొద్దిగా తిన్నా కడుపు నిండినట్లుగా ఉంటుంది.
జొన్నల్లోని కార్బోహైడ్రేట్స్ గ్లూకోజ్ రూపంలో నెమ్మదిగా రక్తంలోకి చేరతాయి. దీని కారణంగా రక్తంలో షుగర్ లెవల్స్ తగ్గుతాయి.
బజ్రాల్లో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా, ఇన్‌సోల్యూబుల్ ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. బజ్రా రోటీ ఇన్సులిన్ సెన్సిటివిటీని, గట్ హెల్త్‌ని కాపాడుతుంది. ఈ రోటీలు తినడం వల్ల తేమ తక్కువగా ఉన్నప్పుడు జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయి. బజ్రాలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. ఇవి గ్లూటెన్ రహితం అదే విధంగా పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల షుగర్ ఉన్నవారికి చాలా మేలు జరుగుతుంది.
