అనసూయతో రొమాంటిక్ ఫొటోస్.. శేఖర్ మాస్టర్ పరువు పాయె! వాళ్లను అలా చూసి..


పాపులర్ నటి, జబర్దస్త్ ఫేమ్ అనసూయతో కలిసి శేఖర్ మాస్టర్ ఓ ఫోటో షూట్ చేశాడు. చూడటానికి రొమాంటిక్ గా కనిపిస్తున్న ఈ స్టిల్స్ శేఖర్ మాస్టర్ పరువు తీస్తున్నాయి. ఇంతకీ ఆ మ్యాటర్ ఏంటి? ఆ వివరాలు చూద్దాం.
అనసూయతో కలిసి శేఖర్ మాస్టర్ మంచి రొమాంటిక్ స్టిల్స్‌కి పోజిచ్చారు. పైగా ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇదే శేఖర్ మాస్టర్ పై ట్రోలింగ్ కి కారణమైంది. అనసూయతో మీరు హైట్ మ్యాచ్ కావడం లేదంటూ వ్యగ్యంగా కామెంట్స్ చేస్తూ నెటిజన్లు ఆయన పరువు తీస్తున్నారు.
జబర్దస్త్ బ్యూటీగా ప్రతి ఒక్కరికీ చేరువైన అనసూయ.. బుల్లితెరకు గ్లామర్ అద్దిన అతికొద్ది మంది యాంకర్లలో ఒకరిగా పేరు సంపాదించింది. మాటలతో మజా చేస్తూనే అందంతో మాయ చేస్తూ పాపులారిటీ పెంచుకుంది. దీంతో అనసూయ క్రేజ్ వేరే లెవెల్‌కి వెళ్లిపోయింది.
రీసెంట్గా జబర్దస్త్‌కి గుడ్ బై చెప్పిన అనసూయ.. వెండితెరపై తన టాలెంట్ చూపిస్తోంది. వరుస ఆఫర్స్ అందుకుంటూ సెట్స్ మీద బిజీ బిజీ అవుతోంది. డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూ సిల్వర్ స్క్రీన్ జర్నీ కొనసాగిస్తోంది.
సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా చేసి సూపర్ రెస్పాన్స్ అందుకున్న ఈ బ్యూటీ.. పుష్ప సినిమాలో దాక్షాయణిగా చేసి ఆకట్టుకుంది. పలు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేస్తూ తన టాలెంట్ చూపిస్తోంది.

News by : V.L
