హెల్దీగా తింటూనే 40 కిలోలు తగ్గిన రోహన్ సేథి, సంవత్సరంలోనే బరువు తగ్గేందుకు ఏం తిన్నాడంటే

బరువు తగ్గడం అంత సులభమేమీ కాదు. అలాంటిది సంవత్సరంలోనే 40 కిలోలు తగ్గడమంటే ఆషామాషీ విషయం కాదు. అలా బరువు తగ్గి తనని తాను మార్చుకున్న వ్యక్తి రోహన్ సేథి. బరువు తగ్గడానికి ఆయన ఏం చేశాడు. ఎలాంటి టిప్స్ ఫాలో అయితే 114 కిలోల నుంచి 74 కిలోలకి చేరుకున్నాడు. హెల్దీగానే బరువు తగ్గి అందరినీ ఎలా ఆశ్చర్యపరిచాడో చెబుతున్నాడు. అంతేకాకుండా, తాను ట్రాన్స్‌ఫార్మ్ అవ్వడానికి ఎలా ప్రయత్నించాడు, తగ్గాక ఎలాంటి కాంప్లిమెంట్స్ వచ్చాయో కూడా షేర్ చేసుకుంటున్నాడు. ఆ వివరాలేంటో మీరు తెలుసుకోండి.
హైలైట్:
- 114 కిలోల నుంచి 74కేజీలకి చేరుకున్న రోహన్ సేథి
- సరైన డైట్‌తోనే సరైన విధంగా సక్సెస్
- పోర్షన్ కంట్రోల్ కీ రోల్ పోషించిందంటున్న రోహన్
బరువు తగ్గడానికి షార్ట్ కట్స్ ఎప్పుడు కూడా పనిచేయవు. సక్సెస్‌ఫుల్‌గా బరువు తగ్గాలంటే సరైన విధంగా ట్రై చేయాలి. మంచి ఫుడ్, డే రొటీన్ ఫాలో అవ్వాలి. దీని వల్ల బరువు తగ్గడం ఈజీ అవుతుంది. ఖాండ్వాకు చెందిన 31 ఏళ్ళ బిజినెస్ మేన్ రోహాన్ సేథి బరువు తగ్గడానికి ముందుగా ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కానీ, మంచి రిజల్ట్ రాలేదు. దాంతో తన బాడీ గురించి తాను తెలుసుకున్నాడు. ఏం చేస్తే బరువు తగ్గుతాడో ప్రయత్నించి ఫాలో అయ్యాడు. ఫలితం సంవత్సరంలోనే 40 కిలోల బరువు తగ్గడం. అనుకున్న విధంగా బరువు తగ్గిన రోహన్ తన వెయిట్‌లాస్ జర్నీని షేర్ చేసుకుంటున్నాడు. తాను ముందు చేసిన తప్పుల ద్వారా తనకి ఏది వర్కౌట్ అవుతుందో తెలుసుకున్నాడు.
నేను ఎక్కువగా ఐస్‌క్రీమ్ తినేవాడిని, చిన్నప్పట్నుండి ఫుడ్ అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా స్వీట్స్ అంటే మరీనూ. కడుపు నిండా తిన్నా తర్వాత కూడా ఒక్కడినే ఫుల్‌గా ఐస్‌క్రీమ్ లాగించేవాడిని. దీంతో బరువు పెరుగుతూనే వచ్చింది. లాక్‌డౌన్‌టైమ్‌లో ఏం చేయాలో తెలియక తిండిపై దండయాత్ర చేశా. మాది పంజాబీ ఫ్యామిలీ. దీంతో ఆటోమేటిగ్గా స్వీట్స్ అంటే మాకు ప్రాణమే. ఫుల్‌గా లాగించేసి బరువు పెరిగా. కానీ, ఆ తర్వాత నా పరిస్థితి చూసి నాకే బాధేసి బరువు తగ్గేందుకు ప్రయత్నించి ఏకంగా 40 కిలోల బరువు తగ్గా

– బరువు పెరగడం వల్ల సైడ్‌ఎఫెక్ట్స్
బరువు ఎంతలా పెరిగాను అంటే నా బాడీ చూసి నాకే సిగ్గేసింది. ఎక్కువసేపు నడవలేకోయా. దీంతో ఇన్‌సెక్యూరిటీ పెరిగి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గింది. దీంతో ఎలా అయినా బరువు తగ్గాలనుకున్నా. దీనికోసం ఇంటర్నెట్‌లో సెర్చ్ చేసి ఏదో డైట్ ఫాలో అవుదామనుకున్నా. కానీ, వర్కౌట్ కాలేదు. వాటిని కంటిన్యూ చేయలేకపోయా. నా బాడీ పెరిగేసరికి బట్టలు ఫిట్ అయ్యేవికావు. దీంతో పార్టీస్‌కి అటెండ్ అవ్వడం, ఫొటోలు దిగడం అవాయిడ్ చేశా. రోజంతా కూర్చునే ఉండేవాడిని. నడవడం మొదలుపెట్టినప్పుడు విపరీతమైన బాడీపెయిన్స్. త్వరగా అలసిపోవడం జరిగేది. దీంతో చాలా సెర్చ్ చేసి ఎన్నో విషయాలు నేర్చుకుని డైట్ ముఖ్యం కాదు. ముందుగా పోర్షన్ కంట్రోల్ కీ రోల్ పోషిస్తుందని తెలుసుకుని అలా ఫాలో అయ్యాను అని తన విషయాల్ని షేర్ చేసుకున్నాడు రోహన్. గతంలో ఎక్కువగా తినే రోహన్ పోర్షన్ కంట్రోల్ చేయడం మొదలుపెట్టాడు.

