Relationship: ఈ 5 టిప్స్ పాటిస్తే పడకగదిలో ప్రతి రోజు పండగే.. ఇక మీ పార్ట్నర్కు మరచిపోలేని అనుభూతి

శృంగార జీవితాన్ని ఫుల్లుగా ఎంజాయ్ చేయడానికి 5 సింపుల్ టిప్స్ ఇప్పుడు చూద్దాం. ఇవి పాటిస్తే ప్రతిరోజు ఫుల్ ఎనర్జీతో పడక గదికి వెళ్లొచ్చని కొన్ని రిపోర్ట్స్ చెబుతున్నాయి.శృంగారం అనేది కేవలం శారీరక కలయిక మాత్రమే కాదు, అది భావోద్వేగాల, మానసిక అనుబంధాల, అంచనాల కలయిక. చాలా మంది శృంగార అనుభవం వ్యక్తిగత కోరికలు, అవసరాలు, గత అనుభవాల ద్వారా ప్రభావితం అవుతుంది. దంపతులు కలకాలం అన్యోన్యంగా జీవించాలంటే వారి మధ్య ప్రేమతో పాటు శృంగార సంతృప్తి కూడా అవసరం.శృంగార జీవితం సరిగా లేకపోతే, దాంపత్య జీవితంలో సమస్యలు పెరుగుతాయి. గొడవలు అవుతాయి, మానసిక ప్రశాంతత లేకుండా పోతుంది. శృంగారాన్ని పూర్తి స్థాయిలో ఎంజాయ్ చేయాలంటే భావప్రాప్తి (Libido) ఎక్కువగా ఉండాలి. ఇది శృంగారంలో సంతృప్తిని సూచిస్తుంది.అయితే సెక్సువల్ డ్రైవ్‌లో లిబిడో తగ్గిపోతే పార్ట్నర్తో లైంగికంగా కలవాలనిపించదు. పార్ట్నర్ అడ్వాన్స్ అవుతున్నా దానికి సరిగ్గా రెస్పాండ్ కాలేరు. పడక సుఖం ఎంజాయ్ చేయలేరు. ఈ సమస్యను నేచురల్‌గా సాల్వ్ చేసుకోవడానికి ఐదు సహజ మార్గాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..స్ట్రెస్ తగ్గించుకోవడం: స్త్రీ, పురుషులు ఇద్దరిలో ఎవ్వరైనా సరే.. ఎక్కువగా ఒత్తిడికి గురైనప్పుడు, శారీరక సామర్థ్యం తగ్గుతుంది. ఒత్తిడి కారణంగా శరీరంలో హార్మోన్ల సమతుల్యత కోల్పోయి అలసట పెరుగుతుంది. దీంతో శృంగార కోరికలు తగ్గిపోతాయి. అందుకే, ఒత్తిడిని నియంత్రించుకోవాలి. దీంతో శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా సెక్సువల్ క్రేవింగ్స్ పెరుగుతాయి.

