good news : Reduced prices of milk, biscuits, toothpaste, noodles.. Amul, Patanjali

Amul Cuts Dairy Prices: సోమవారం నుంచి పలు వస్తువులు, ఉత్పత్తులపై జీఎస్టీ రేట్లు భారీగా తగ్గుతున్నాయి. వంట గది సరకుల నుంచి.. వైద్య పరికరాలు, ఎలక్ట్రానిక్స్, మందులు ఇలా చాలానే వస్తువులపై పలు కంపెనీలు ధరల్ని తగ్గించాయి. ఇక ఇప్పుడు అమూల్, పతంజలి సంస్థలు కూడా కీలక ప్రకటన చేశాయి. తమ ప్రొడక్ట్స్‌పై ధరల్ని తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి.

హైలైట్:

  • జీఎస్టీ రేట్ల తగ్గింపు
  • ధరల్ని తగ్గించిన పతంజలి ఫుడ్స్, అమూల్
  • కొత్త రేట్లు 22 నుంచి అమల్లోకి

Patanjali Foods GST : జీఎస్టీ 2.0 సంస్కరణల్లో సెప్టెంబర్ 22 కీలకమైన రోజు. పన్ను శ్లాబుల్లో కీలక మార్పులు చేసిన సంగతి తెలిసిందే. 12, 28 శాతం శ్లాబుల్ని పూర్తిగా ఎత్తేయగా.. ఇప్పుడు 5, 18 శాతం శ్లాబులు మాత్రమే ఉండనున్నాయి. ఈ క్రమంలోనే ఎక్కువ శాతం పన్ను శ్లాబు నుంచి ఉత్పత్తులు, వస్తువులు.. తక్కువ శాతం శ్లాబులోకి చేరాయి. స్టేషనరీ, ప్రాణాధార ఔషధాలు, మరో 33 రకాల ఔషధాలు సహా హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్‌పై జీఎస్టీని పూర్తిగా మినహాయించారు. ఇక్కడ ఎలాంటి జీఎస్టీ కట్టాల్సిన పని లేదు. మరోవైపు జీఎస్టీ రేట్లు తగ్గగా.. ఆయా సంస్థలు తగ్గింపు ధరలతో కొత్త రేట్లను ప్రకటిస్తూ వస్తున్నాయి.

ప్రముఖ డెయిరీ సంస్థ అమూల్ బ్రాండ్‌పై డెయిరీ ఉత్పత్తుల్ని తయారు చేసే గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్.. తన దాదాపు 700 కిపైగా ప్రొడక్ట్స్ ధరల్ని తగ్గించింది. ఇది సెప్టెంబర్ 22 నుంచే అమల్లోకి వచ్చింది. జీఎస్టీ కోత ప్రయోజనాల్ని కస్టమర్లకు అందించాలన్న ఉద్దేశంతోనే ధరల్ని తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.

అమూల్ ధరలను తగ్గించిన వాటిల్లో.. నెయ్యి, UHT మిల్క్, బటర్ ఐస్‌క్రీమ్, వెన్న, పనీర్, చాక్లెట్స్, బేకరీ, పొటాటో స్నాక్స్, ఫ్రోజన్ స్నాక్స్, మాల్ట్ ఆధారిత డ్రింక్స్ సహా 700కుపైగా ఉత్పత్తుల ధరలు తగ్గాయని తెలిపింది. ఇక్కడ 100 గ్రాముల వెన్న ధర రూ. 62 నుంచి రూ. 58 కి తగ్గింది. నెయ్యి ధర లీటరుపై రూ. 40 తగ్గగా ఇప్పుడు రూ. 610 కి చేరింది. అమూల్ ప్రాసెస్డ్ వెన్న కిలోకు రూ. 30 తగ్గి రూ. 545 కు చేరింది. ఫ్రోజెన్ పనీర్ (200 గ్రాములు) ధర రూ. 99 నుంచి రూ. 95 కు దిగొచ్చింది.

పతంజలి ఫుడ్స్ ధరలు తగ్గింపు..

పతంజలి ఫుడ్స్ కూడా అమూల్ బాటలోనే ధరల్ని తగ్గించింది. న్యూట్రెలా సోయా చంక్స్ సహా పలు ఉత్పత్తులపై ధరల్ని తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. మినీ చంక్స్ అండ్ గ్రాన్యూల్స్ (కేజీ ప్యాక్), న్యూట్రెలా చంక్స్ ధర రూ. 210 నుంచి రూ. 190 కి తగ్గించింది. 200 గ్రాముల ప్యాక్‌పైన ధర రూ. 3 తగ్గింది. దూద్ బిస్కెట్ 35 గ్రాముల ధర రూ. 5 నుంచి రూ. 4.5 కు తగ్గింది. ఇంకా నోటి సంరక్షణ, హెయిర్ కేర్ ప్రొడక్ట్స్, నూడుల్స్ ధరలను కూడా తగ్గించింది.

దంత్ కాంతి నాచురల్ టూత్‌పేస్ట్ (200 గ్రా.) ధర రూ. 120 నుంచి రూ. 106 కు తగ్గింది. కేశ్‌కాంతి ఆమ్లా హెయిర్ ఆయిల్ (100 ml) ధర రూ. 48 గా ఉండగా.. ఇప్పుడు రూ. 42కు తగ్గింది. హెల్త్, వెల్నెస్ ప్రొడక్ట్స్‌కు సంబంధించి.. ఆమ్లా జ్యూస్ ధర లీటరుపై రూ. 150 నుంచి రూ. 10 తగ్గింది. ఆవు నెయ్యి ధర 900 ఎంఎల్‌పై రూ. 780 నుంచి రూ. 732 కు దిగొచ్చింది.



		
		
			

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *