Reduce cholesterol: ఈ ఐదు తింటే.. కొలెస్ట్రాల్ సులభంగా కరుగుతుంది..!
అధిక కొలెస్ట్రాల్ మీ గుండె ఆరోగ్యానికి చాలా ప్రమాదం. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే.. గుండె జబ్బులు, స్ట్రోక్, గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ప్రముఖ పోషకాహార నిపుణురాలు నమామి అగర్వాల్ కొలెస్ట్రాల్‌ను సులభంగా తగ్గించే.. కొన్ని టిప్స్ పంచుకున్నారు. అవేంటో చూసేయండి.ప్రస్తుత కాలంలో ఫాలో అవుతున్న.. లైఫ్‌స్టైల్, చెడు ఆహార అలవాట్ల కారణంగా అనారోగ్య సమస్యలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా.. గుండె సమస్యలతో బాధపడే వారి సంఖ్య పెరిగిపోతుంది. గుండె సమస్యలకు ప్రధాన కారణం.. అధిక కొలెస్ట్రాల్. కొలెస్ట్రాల్ అనేది మైనం లాంటి పదార్థం. కొలెస్ట్రాల్ రెండు రకాలు ఉంటుంది. ఒకటి చెడు కొలెస్ట్రాల్ (LDL), రెండు మంచి కొలెస్ట్రాల్ (HDL). మన శరీరంలో చెడ్డ కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్) ఎక్కువైతేనే ప్రమాదం. దీంతో గుండె రక్తనాళాల్లో పూడికలు ఏర్పడే ముప్పు ఎక్కువవుతుంది. అదే మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్) రక్తంలోంచి చెడ్డ కొలెస్ట్రాల్‌ను తొలగించటానికి సహాయపడుతుంది.కొలెస్ట్రాల్ మనం తీసుకునే ఆహారం నుంచీ, శరీరం లోపలా తయారవుతుంది. శరీరంలో కొలెస్ట్రాల్ లివర్‌లో తయారవుతుంది. సంతృప్త కొవ్వు, ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉండే ఆహారంలో కొలెస్ట్రాల్ ఎక్కుగా ఉంటుంది. ఆహారం ద్వారా పొందే కొలెస్ట్రాల్ మనం తీసుకునే పాలు, పాలపదార్థాలు, మాంసాహారం, చేపలు, గుడ్లులోని పచ్చసొన నుంచి అందుతుంది. పాల ఉత్పత్తులు, నూనెలలో సంతృప్త కొవ్వు ఎక్కువగా ఉన్నందున… వాటిని తక్కువగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అధిక కొలెస్ట్రాల్ మీ గుండె ఆరోగ్యానికి చాలా ప్రమాదం. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే.. గుండె జబ్బులు, స్ట్రోక్, గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ప్రముఖ పోషకాహార నిపుణురాలు నమామి అగర్వాల్ కొలెస్ట్రాల్‌ను సులభంగా తగ్గించే.. కొన్ని టిప్స్ పంచుకున్నారు. అవేంటో చూసేయండి.వెల్లుల్లి..రక్తంలోని సిరల్లో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి.. రోజూ వెల్లుల్లి తీసుకుంటే మంచిదని నమామి అగర్వాల్ అన్నారు. ప్రతి రోజూ సగం వెల్లుల్లి రెబ్బను తీంటే.. కొలెస్ట్రాల్ స్థాయి 10% తగ్గుతుందని NCBI నివేదిక స్పష్టం చేసింది. చెడు కొలెస్ట్రాల్ (LDL-C), ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గించడంలో వెల్లుల్లి ప్రభావవంతంగా పని చేస్తుంది. వెల్లుల్లిలో విటమిన్ బి 6, విటమిన్ సి , ఫైబర్, మెగ్నీషియం, కాల్షియం, ప్రోటీన్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి బరువు తగ్గించటంలో కీలకమైన పాత్రను పోషిస్తాయి. కొలెస్ట్రాల్ కరగడానికి రోజుకు 500 నుంచి 1000 mg వెల్లిల్లి తీసుకుంటే సరిపోతుందని కొన్ని అధ్యయనాలు స్పష్టం చేశాయి. సాధారణంగా రోజుకు ఒకటి నుంచి రెండు పచ్చి వెల్లుల్లి రెబ్బలకు మించి తినకూడదు.కొత్తిమీర, ధనియాల్లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి అధిక కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. ధనియాల్లో ఫోలిక్ యాసిడ్, విటమిన్ సి, విటమిన్ ఎ, బీటా కెరోటిన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలోని కాపర్, జింక్, ఐరన్ వంటి మినరల్స్ గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఒక స్పూన్ ధనియాలు.. నీటిలో వేసి రెండు నిమిషాలు పాటు మరిగించి.. వడగాట్టాలి. ఇలా తాయారు చేసుకున్న నీటిని రోజూ తాగితే.. కొలెస్ట్రాల్ తగ్గుతుంది.

