Rashmika: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఆస్తుల విలువ తెలుసా? మీరు అస్సలు ఊహించలేరు బాబోయ్

టాలీవుడ్ రూమర్డ్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఆస్తులు, సంపాదన గురించి తెలుసుకుందాం.సెలబ్రిటీల లైఫ్ స్టైల్, ముఖ్యంగా స్టార్ల లవ్ అండ్ మ్యారేజ్ విషయాలు తెలుసుకోవడానికి అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా ఉన్న రూమర్డ్ కపుల్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), రష్మిక మందన్న (Rashmika Mandanna) గురించి అయితే ఆ క్యూరియాసిటీ డబుల్ అవుతుంది. వీళ్లిద్దరూ తమ కెరీర్‌లోనే కాదు, సంపాదనలోనూ ఓ రేంజ్‌లో దూసుకెళ్తున్నారు. వీరిద్దరి లగ్జరీ ఇళ్లు, కార్లు, ఆస్తుల వివరాలు చూద్దాం.రష్మిక మందన్న తగ్గేదేలే.. నేషనల్ క్రష్, పాన్-ఇండియా స్టార్‌డమ్‌తో దూసుకెళ్తున్న రష్మిక మందన్న నెట్ వర్త్ దాదాపు రూ.65 కోట్లు ఉంటుందని సమాచారం. సినిమాకు రూ.4 కోట్లు తీసుకునే రష్మిక, ‘పుష్ప 2’ లాంటి భారీ ప్రాజెక్టుకు ఏకంగా రూ.10 కోట్లు ఛార్జ్ చేసిందనే టాక్ వినిపిస్తోంది. సినిమాలే కాదు, రియల్ ఎస్టేట్‌లో కూడా ఇన్వెస్ట్ చేసింది. ఆమెకు బెంగళూరులో దాదాపు రూ.8 కోట్ల విలువైన ఓ స్టైలిష్ ఇల్లు ఉంది. వీటితో పాటు లెక్కలేనన్ని బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు, ఇతర వ్యాపారాల ద్వారా సంపాదనను పెంచుకుంటోంది.
విజయ్ దేవరకొండ నెట్‌వర్త్: టాలీవుడ్‌లో ‘రౌడీ’ బ్రాండ్‌తో సెన్సేషన్ క్రియేట్ చేసిన విజయ్ దేవరకొండ నెట్ వర్త్ సుమారు రూ.50 నుంచి 60 కోట్ల వరకు ఉంటుందని అంచనా. సినిమాలు, బ్రాండ్ ప్రమోషన్స్, సొంత వ్యాపారాల ద్వారా విజయ్ భారీగా సంపాదిస్తున్నాడు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఏకంగా రూ.15 కోట్ల విలువైన ఓ లగ్జరీ భవనం ఉంది. కార్ల కలెక్షన్ విషయంలోనూ విజయ్ టేస్ట్ వేరు. అతడి గ్యారేజీలో రూ. 85 లక్షల విలువైన వోల్వో ఎక్స్‌సి90 (Volvo XC90), BMW 5 సిరీస్, రేంజ్ రోవర్, ఫోర్డ్ మస్టాంగ్ వంటి కాస్ట్లీ కార్లు ఉన్నాయి. విజయ్‌కు ప్రైవేట్ జెట్ ఉందని టాక్ ఉన్నా, దీని గురించి క్లారిటీ లేదు. సీక్రెట్ ఎంగేజ్‌మెంట్: రీసెంట్‌గా టాలీవుడ్ సర్కిల్స్‌లో ఓ న్యూస్ బాగా వైరల్ అవుతోంది. 2025, అక్టోబర్ 3న విజయ్-రష్మికకు సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్ జరిగిందనేది ఆ వార్త సారాంశం. ఈ ఫంక్షన్‌కు కేవలం ఫ్యామిలీ మెంబర్స్, క్లోజ్ ఫ్రెండ్స్ మాత్రమే అటెండ్ అయ్యారని, ఒక్క ఫొటో కూడా బయటకు రాలేదని అంటున్నారు. ఈ జంట తమ రిలేషన్‌షిప్‌ను ఎప్పుడూ అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేయలేదు కానీ, వీరి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ ఉందని ఫ్యాన్స్‌కు నమ్మకం. 2018లో ‘గీత గోవిందం’ సెట్‌లో మొదలైన వీరి జర్నీకి ఐదేళ్లు దాటాయని ఫ్యాన్స్ లెక్కలేస్తున్నారు.మరి పెళ్లి ఎప్పుడు? ఎంగేజ్‌మెంట్ రూమర్స్ స్ప్రెడ్ అవ్వడంతో, ఇప్పుడు అందరి ఫోకస్ ఈ స్టార్ కపుల్ పెళ్లిపై పడింది. 2026, ఫిబ్రవరిలో వీళ్ల పెళ్లి ఉండొచ్చని ఓ ప్రచారం జరుగుతోంది. అయితే, ప్రస్తుతం ఇద్దరూ కెరీర్ పీక్స్‌లో ఉండి, వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు కాబట్టి ఈ డేట్ మారే ఛాన్స్ ఉంది. మరి ఈ క్రేజీ కపుల్ తమ రిలేషన్‌షిప్‌పై ఎప్పుడు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇస్తారో చూడాలి. కెరీర్ లైఫ్: ప్రొఫెషనల్ లైఫ్‌లోనూ విజయ్, రష్మిక ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. 2025లో రష్మిక సల్మాన్ ఖాన్‌తో ‘సికిందర్’, విక్కీ కౌశల్‌తో ‘ఛావా’, ధనుష్‌తో ‘కుబేర’ వంటి భారీ పాన్-ఇండియా సినిమాలు చేసి మెప్పించింది. మరోవైపు విజయ్ దేవరకొండ కూడా ‘కింగ్‌డమ్’ లాంటి స్పై థ్రిల్లర్‌తో అలరించాడు. ఇప్పుడు ‘VD14’ పీరియడ్ డ్రామా వంటి వెరైటీ ప్రాజెక్టులతో బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి రెడీ అవుతున్నాడు.