‘ఇబ్బందుల్లో ఉన్నా.. బాగా కుంగిపోయా’.. యాంకర్ రష్మీ షాకింగ్ నిర్ణయం.. ఏం జరిగిందంటే?

ప్రస్తుతం టీవీ షోలతో బిజి బిజీగా ఉంటోంది యాంకర్ రష్మీ గౌతమ్. అప్పుడప్పుడు సినిమాల్లోనూ మెరుస్తోందీ అందాల తార. ఇక సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. ఈ నేపథ్యంలో రష్మీ షేర్ చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరలవుతోంది.ప్రస్తుతం జబర్దస్త్, శ్రీదేవీ డ్రామా కంపెనీతో పాటు పలు టీవీషోలతో బిజి బిజీగా ఉంటోంది యాంకర్ రష్మీ. సినిమాల్లోనూ మెరుస్తోంది. ఇక సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలను అందులో షేర్ చేసుకుంటుంది. అలాగే తన గ్లామరస్ ఫొటోలు, వీడియోలను ఫాలోవర్లతో పంచుకుంటుంది. అయితే ఉన్నట్లుండి రష్మి ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. దీనిని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఆమెకు ఏమైందంటూ? నెట్టింట ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ‘ప్రస్తుతం నేను వ్యక్తిగతంగానూ, వృత్తిపరంగానూ కాస్త ఇబ్బందులో ఉన్నాను. అలాగే సోషల్ మీడియాలో చెప్పే అడ్డమైన నీతులు వినే ఓపిక, తీరిక నాకు లేదు. అందుకే నెల రోజుల పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. నేను మళ్లీ బలంగా, ధైర్యంగా తిరిగొస్తానని హామీ ఇస్తున్నాను. నేను ఇంకా చాలా నిరూపించుకోవాల్సి ఉంది. నా శక్తిని నేను పునరుద్ధరించుకోవాల్సిన అవసరముంది. దానికి మీ డిజిటల్ ఎంకరేజ్ మెంట్ అవసరం లేదు. నాకున్న కాన్ఫిడెన్స్ తో దాన్ని సాధించుకోలగను’నా దృఢమైన ఆత్మవిశ్వాసాన్ని నేనెప్పుడు కోల్పోలేదు. అదెప్పుడూ నా దగ్గరే ఉంటుంది. అయితే ఎక్కడో ఓ చోట నేను బాగా కుంగిపోతున్నాను. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం కనుక్కోవాల్సిన సమయం ఆసన్నమైంది. సోషల్ మీడియాలో నేను యాక్టివ్‌గా లేకపోయినా మీ ప్రోత్సాహం, ప్రేమ, సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నాను’ అని రష్మి రాసుకొచ్చింది.యాంకర రష్మీ షేర్ చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. దీనిని చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఆమెకు ఏమైందోనంటూ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. కాగా కొన్నాళ్ల క్రితం రష్మికి సర్జరీ జరిగింది. ఈ కారణంగానే ఆమె మానసికంగా ఇబ్బంది పడుతోందా? అని కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా రష్మి త్వరగా కోలుకుని మునపటిలా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండాలని నెటిజన్లు కోరుతున్నారు.
