రామ్ ప్రసాద్ బిస్మిల్

రామ్ ప్రసాద్ బిస్మిల్ (1897 జూన్ 11 -1927 డిసెంబరు 19) ఇతను భారతీయ విప్లవకారుడు. ఇతను 1918 మణిపురీ కుట్ర, 1925 కాకోరీ కుట్ర వంటివాటిలో పాల్గొని బ్రిటీష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడాడు. స్వాతంత్ర్య సమరయోధుడు కావడంతో పాటుగా రామ్, ఆగ్యాత్, బిస్మిల్ వంటి కలంపేర్లతో హిందీ, ఉర్దూ భాషల్లో దేశభక్తి కవితలు రాసిన కవి. కానీ అతను బిస్మిల్ అన్న పేరుతోనే ప్రఖ్యాతులయ్యాడు. స్వామి దయానంద సరస్వతి రాసిన సత్యార్థ్ ప్రకాష్ పుస్తకం స్ఫూర్తినివ్వగా, అతను ఆర్య సమాజ్ సంస్థతో అనుబంధం కలిగివుండేవాడు. అతి గురువు ఆర్య సమాజ్ బోధకుడు, స్వామి సోమ్ దేవ్ ద్వారా లాలా హర్ దయాళ్ తో రహస్య సంబంధం కలిగివుండేవాడు.
హిందుస్తాన్ రిపబ్లికన్ అసోసియేషన్ అనే విప్లవ సంస్థ వ్యవస్థాపక సభ్యుల్లో బిస్మిల్ ఒకడు. భగత్ సింగ్ అతనిని ఉర్దూ, హిందీ భాషల్లో గొప్ప కవిగా ప్రశంసించేవారు. కవిత్వ రచనతో పాటుగా అతను ఆంగ్లం నుంచి కేథరీన్, బెంగాలీ నుంచి బోల్షెవికోం కీ కర్తూత్ పుస్తకాలను హిందీలోకి అనువదించాడు. సర్ఫరోషీ కీ తమన్నాతో సహా అనేక స్ఫూర్తిదాయకమైన దేశభక్తి గీతాలు రచించాడు.
తొలినాళ్ళ జీవితం
రాం ప్రసాద్ బిస్మిల్ 1897 జూన్ 11లో బ్రిటీష్ ఇండియాలో వాయవ్య సరిహద్దు ప్రావిన్సులోని షాజహాన్ పూర్ లో జన్మించాడు. అతని ఇంట్లో తన తండ్రి నుండి హిందీ నేర్చుకొని ఒక మౌల్వీ నుండి ఉర్దూ తెలుసుకోవడానికి వెళ్లాడు.దానికి అతని తండ్రి తిరస్కరించి ఆంగ్ల భాష పాఠశాలలో చేర్పించాడు, షాజహాన్పూర్ ఆర్య సమాజ్ లో చేరారు.

