శ్రీవారి దర్శనానికి తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను పరిగణలోకి తీసుకోవాలని తాను గతంలో కోరారనని నా విజ్ఞప్తిని మన్నించి అందుకు అంగీకరించిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(AP CM Chandrababu Naidu), టీటీడీ (TTD) చైర్మన్ కు మెదక్ ఎంపీ రఘునందన్ రావు (Raghunandan Rao) కృతజ్ఞతలు తెలిపారు.
ఇవాళ తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. టీటీడీ ద్వారా వస్తున్న ప్రతి రూపాయినీ ధార్మిక కార్యక్రమాలకే ఉపోయోగించాలని డిమాండ్ చేశారు. వీటిని ఇతర కార్యక్రమాలకు మళ్లించవద్దన్నారు. అలాగే తెలంగాణ ప్రాంతంలో ధూప దీప నైవేద్యాలకు నోచుకోలని అనేక దేవస్థానాలు ఉన్నాయని వాటికి టీటీడీ నిధులు వెచ్చించాలని సీఎం, టీటీడీ చైర్మన్ కు విజ్ఞప్తి చేశారు.
వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో ఈ దేశంలో చాలా కాలంగా ఎదురు చూస్తున్న వక్ప్ చట్ట సవరణ బిల్ ఆమోదం పొందిందని, బిల్ ఆమోదం తర్వాత తాను పార్లమెంట్ నుంచి నేరుగా తిరుమలకు వచ్చానని చెప్పారు. ఈ బిల్ ఆమోదం కోసం సహకరించిన రాజకీయ పార్టీలకు, సహచర ఎంపీలందరికీ కృతజ్ఞతలు తెలిపారు.