Prostate Cancer: అబ్బాయిలు.. రాత్రిళ్ళు ఎక్కువసార్లు మూత్రానికి వెళ్తున్నారా?.. అయితే మీకు ఈ 2 డేంజరస్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు జాగ్రత్త!!

రాత్రిపూట ఎక్కువసార్లు మూత్ర విసర్జన (Urination)కు వెళ్లాల్సి వస్తోందా? వెంట వెంటనే బ్లాడర్ నిండిపోయిన ఫీలింగ్‌తో నిద్ర నుంచి మెలకువ వస్తోందా? ఇది ప్రొస్టేట్ క్యాన్సర్ (Prostate Cancer) లక్షణం కావచ్చు. రాత్రిపూట ఎక్కువసార్లు మూత్ర విసర్జన (Urination)కు వెళ్లాల్సి వస్తోందా? వెంట వెంటనే బ్లాడర్ నిండిపోయిన ఫీలింగ్‌తో నిద్ర నుంచి మెలకువ వస్తోందా? మెడికల్ టర్మినాలజీలో దీన్ని నోక్టురియా (Nocturia) అంటారు. రాత్రిపూట పడుకునేముందు ఎక్కువగా నీళ్లు తాగడం వల్ల ఇలా జరుగుతుందని చాలా మంది అనుకుంటారు. కానీ ఇది ప్రొస్టేట్ క్యాన్సర్ (Prostate Cancer) లక్షణం కావచ్చు. అసలు నోక్టురియా అంటే ఏంటి? ప్రొస్టేట్ క్యాన్సర్‌కి, దీనికి ఉన్న లింక్ ఏంటి? వీటి లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం.నోక్టురియా
నోక్టురియా అనేది ప్రొస్టేట్ క్యాన్సర్ లక్షణం. ఈ సమస్య ఉన్నవారు.. రాత్రిపూట తరచుగా మూత్ర విసర్జన చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నిద్ర, డైలీ రొటీన్‌కి అంతరాయం కలగడంతో ఇబ్బంది పడతారు. దీనికి ఎన్నో కారణాలు ఉండవచ్చు. బెనిన్ ప్రొస్టాటిక్ హైపర్‌ప్లాసియా (Benign Prostatic Hyperplacia- BPH) నోక్టురియాకు ప్రధాన కారణం.
అంటే, ప్రొస్టేట్ గ్రంథి (Prostate Gland) సైజ్ పెరగడం వల్ల మూత్రనాళం ఒత్తిడికి గురై ప్రెస్ చేసినట్లు అవుతుంది. ఫలితంగా, మూత్రాశయం నిండినట్లు అనిపిస్తుంది. ఓవర్ యాక్టివ్ బ్లాడర్.. మూత్రాన్ని త్వరగా బయటకు పంపించాలనే ఆకస్మిక పరిస్థితిని ఏర్పరచి నోక్టురియాకు దారితీస్తుంది. అదే విధంగా, ప్రొస్టేట్ గ్రంథిని క్యాన్సర్ కణితి ప్రభావితం చేయడం వల్ల మూత్రాశయ పనితీరు దెబ్బతిని నోక్టురియా పరిస్థితిని కలిగిస్తుంది.సీరియస్ ప్రాబ్లమ్
పురుషులు ఈ లక్షణాన్ని లైట్ తీసుకోవద్దు. ఏదైనా అసౌకర్యం అనిపిస్తే, వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్లి సమస్యను వివరించారు. వారు కొన్ని టెస్టులు చేసి అది నోక్టురియానా లేదా ప్రొస్టేట్ క్యాన్సరా అనేది గుర్తిస్తారు. నోక్టురియాను ముందే పరిష్కరించకపోతే ప్రొస్టేట్ క్యాన్సర్‌ని ఎర్లీ స్టేజ్‌లో గుర్తించడం కష్టమవుతుంది. పరోక్షంగా, ఇది ట్రీట్‌మెంట్ రిజల్ట్స్‌ని ఎఫెక్ట్ చేస్తుంది. మరోవైపు, నోక్టురియా లైఫ్ క్వాలిటీని దెబ్బతీస్తుంది. దీంతో, నిద్రకు ఆటంకాలు ఏర్పడి రోజంతా అలసటగా అనిపించడంతో పాటు ప్రొడక్టవిటీ తగ్గుతుంది.ప్రొస్టేట్ క్యాన్సర్ లక్షణాలు
ప్రొస్టేట్ గ్రంథిలో కణతి ఏర్పడటం వల్ల క్రమంగా దాని సైజ్ పెరిగి అది మూత్రనాళంపై ఒత్తిడి తెస్తుంది. దీంతో, మూత్రాశయ పనితీరు ప్రభావితం అవుతుంది. మూత్ర ప్రవాహం నెమ్మదిగా రావడం, యూరినేషన్ సమయంలో నొప్పి, మూత్రంలో రక్తం, వీర్యం (Blood in Urine) వంటి లక్షణాలు కనిపిస్తాయి.యూరినేషన్ స్టార్ట్ చేయడం, ముగించడంలో ఇబ్బందులు రావడం, అంతరాయంతో కూడిన మూత్రప్రవాహం, ఆకస్మికంగా యూరినేషన్ కావడం, మూత్రాన్ని ఆపుకోలేకపోవడం, వెన్ను నొప్పి (Back Pain), అంగస్తంభన లోపం (Erectile Dysfunction), ఎలాంటి ప్రయత్నం లేకుండానే బరువు తగ్గడం (Sudden Weight Loss), బలహీనత (Weakness) వంటివి ప్రొస్టేట్ క్యాన్సర్ లక్షణాలు.

