సెలబ్రిటీలకు షాకిచ్చిన పోలీసులు..అడ్డంగా దొరికిపోయారే..!

కొన్ని రోజులుగా బెట్టింగ్ యాప్స్ గురించి విపరీతమైన చర్చ సాగుతోంది. బెట్టింగ్ యాప్స్ కారణంగా అనేక మంది అమాయకులు తమ ప్రాణాలు కోల్పోతున్నారు. తొలుత సులువుగా డబ్బులు ఇస్తున్నట్టు చేసి ఆ తర్వాత వారి నుంచి డబ్బులు గుంజడం మొదలుపెడతారు. బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు పెట్టే వేధింపుల తట్టుకోలేక చాలామంది ఆత్మహత్య చేసుకున్నారు. ఇటువంటి నేపథ్యంలో తెలంగాణ పోలీసులు బెట్టింగ్ యాప్స్ నజర్ పెట్టింది.
బెట్టింగ్ యాప్స్‌ను కొంత సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లు, యూట్యూబర్లు, సెలబ్రిటీలు డబ్బులు కోసం ప్రమోట్ చేస్తున్నారు. వీరిపై పోలీసుల దృష్టిసారించారు. బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులపైనే కాకుండా, ఆ యాప్స్‌ను ప్రమోట్ చేసిన వారిపై కూడా పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. దీనిలో భాగంగానే కొందరు సినీ సెలబ్రిటీలపై కేసులు నమోదు కావడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న 11 మంది తెలుగు సెలబ్రిటీలపై కేసులు నమోదు చేశారు.
హర్షసాయి, పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ ఖాన్, టెస్టీ తేజ, కిరణ్ గౌడ్, విష్ణుప్రియ, యాంకర్ శ్యామల, రీతూ చౌదరి, బండారు షేషయాని సుప్రిత తదితరులపై పంజాగుట్ట పోలీసులు కేసులు నమోదు చేశారు. కొన్నిరోజులుగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఈ బెట్టింగ్ యాప్‌ల నిర్వాహకులపై సీరియస్‌గా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తు వచ్చారు.ఈ క్రమంలో పోలీసులు బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన వారిపై కేసులు నమోదు చేసినట్టు తెలుస్తోంది.
