PMS diet: పీరియడ్స్‌కి ముందు తినాల్సిన ఫుడ్స్.. మూడ్ స్వింగ్స్ తగ్గించి, ఎమోషన్స్ బ్యాలెన్స్ చేసే ఆహారాలు

పీరియడ్స్ ముందు మూడ్ స్వింగ్స్ తగ్గించడానికి ఫ్యాటీ ఫిష్, ఆకుకూరలు, తృణధాన్యాలు, డార్క్ చాక్లెట్, ఫెర్మెంటెడ్ ఫుడ్స్, హెర్బల్ టీలు, నట్స్, సీడ్స్ తినాలి. ఇవి హార్మోన్ల ప్రభావాన్ని తగ్గిస్తాయి.పీరియడ్స్ (Periods) సమయం దగ్గర పడుతున్నప్పుడు మూడీగా, చిరాగ్గా లేదా డల్‌గా అనిపిస్తోందా? ఇది చాలా మందికి కామన్. పీరియడ్స్‌కి ముందు హార్మోన్లలో వచ్చే మార్పులు ఎమోషన్స్‌పై పెద్ద ఎఫెక్ట్ చూపిస్తాయి. కానీ ఈ సమయంలో మనం తినే ఫుడ్, మూడ్‌ను స్టేబుల్‌గా ఉంచగలదు. కొన్ని ఆహారాలు (Foods) బ్రెయిన్‌కి సపోర్ట్ ఇచ్చి, ఆందోళన తగ్గించి, ఎమోషనల్ అప్స్ అండ్ డౌన్స్ రాకముందే కంట్రోల్ చేయగలవు. పీరియడ్స్‌కి ముందు మూడ్ స్వింగ్స్ (Periods mood swings) తగ్గించుకుని, ఎమోషనల్‌గా బ్యాలెన్స్డ్గా ఉండటానికి ఏం తినాలో చూద్దాం.

ఫ్యాటీ ఫిష్
సాల్మన్, సార్డినెస్, మాకేరెల్ లాంటి చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ హెల్తీ ఫ్యాట్స్ బాడీలో ఇన్ఫ్లమేషన్ తగ్గించి, మెంటల్ హెల్త్‌కి సపోర్ట్ చేస్తాయి. ఒమేగా-3లు డిప్రెషన్ లక్షణాలను తగ్గించి, హార్మోన్ల వల్ల వచ్చే మూడ్ స్వింగ్స్‌ని కంట్రోల్ చేస్తాయి. ఒకవేళ చేపలు తినకపోతే, డాక్టర్ సలహాతో ఫిష్ ఆయిల్ సప్లిమెంట్ తీసుకోవచ్చు.

ఆకుకూరలు
పాలకూర, మెంతికూర లాంటి వాటిలో మెగ్నీషియం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ మినరల్ మన మెదడు ఎమోషన్స్‌ని మేనేజ్ చేయడం, పీరియడ్స్ ముందు వచ్చే టెన్షన్, చిరాకు వంటి లక్షణాలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మెగ్నీషియం ఎక్కువగా ఉండే ఆహారాలు తింటే చాలా రిలాక్స్డ్గా అనిపిస్తుంది. ఆకుకూరల్ని మీల్స్‌లో యాడ్ చేసుకోవచ్చు, స్మూతీలో మిక్స్ చేసుకోవచ్చు, కూరల్లో కలపవచ్చు, లేదా సలాడ్‌లో యాడ్ చేసుకోవచ్చు.

డార్క్ చాక్లెట్
పీరియడ్స్‌కి ముందు స్వీట్స్ తినాలనిపిస్తోందా? అయితే 70% లేదా అంతకన్నా ఎక్కువ కోకో ఉన్న డార్క్ చాక్లెట్ తీనాలి. ఇందులో మెగ్నీషియం, మూడ్‌ని మంచి చేసే కాంపౌండ్స్ ఉంటాయి. ఇవి మనసును కామ్‌గా ఉంచుతాయి. కానీ ఒకటి, రెండు ముక్కలు చాలు.

