PM Modi: Which Jyotirlingas did Prime Minister Modi visit from Kashi to Srisailam?

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శక్తివంతమైన రాజకీయ నాయకుడే కాదు.. హిందూ మత విశ్వాసాన్ని కలిగి ఉన్న నేత. మోడీ ప్రధానిగా దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో పర్యటించారు. పుణ్యక్షేత్రాలను దర్శించుకున్నారు. వాటిల్లో హిందువులు అత్యంత పవిత్రంగా భావించే జ్యోతిర్లింగాల దర్శనం కూడా ఉంది. ప్రధాని మోదీ ఏదైనా మతపరమైన ప్రదేశాన్ని సందర్శించినప్పుడల్లా.. అది ఆయన వ్యక్తిగత భక్తిని సూచించడమే కాదు.. భారతదేశ ప్రాచీన ఆధ్యాత్మిక సంప్రదాయాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళుతుంది. ఈ నేపధ్యంలో ఈ రోజు ప్రధాని మోడీ ఇప్పటి వరకూ ఎన్ని జ్యోతిర్లింగ క్షేత్రాలను దర్శించారో తెలుసుకుందాం ..

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తరచుగా దేశంలోని గొప్ప ప్రదేశాలపైనే కాదు ఆధ్యాత్మిక వారసత్వంపై తనకున్న విశ్వాసాన్ని తెలియజేస్తూనే ఉంటారు. ప్రధాని మోడీ దేశంలో అనేక పుణ్యక్షేత్రాలను, ప్రముఖ దేవాలయాలను దర్శించుకున్తూనే ఉన్నారు. అలా ఆయన సందర్శించిన ఆధ్యాత్మిక క్ష్ట్రాల్లో పవిత్ర జ్యోతిర్లింగాలు, శక్తి పీఠాలు ఉన్నాయి. ఈ సందర్శన ఆయన వ్యక్తిగత భక్తిని ప్రతిబింబించడమే కాదు దేశ ఐక్యత, సాంస్కృతిక స్పృహను కూడా బలోపేతం చేస్తుంది. ప్రధానమంత్రి మోడీ ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లాలో ఉన్న శీశైలం క్షేత్రంలో పర్యటించారు. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల దేవస్థానం సందర్శించి పూజలు చేశారు.

ఈ ఆలయం ప్రముఖ శైవ క్షేత్రం. శివుని 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. ఒకే ప్రాంగణంలో మల్లికార్జున జ్యోతిర్లింగం. 52 శక్తిపీఠాలలో ఒకటైన భ్రమరాంబ ఆలయం ఉన్నాయి. ఈ నేపధ్యంలో ఈ రోజు దేశంలోని ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ప్రధాని మోడీ ఇప్పటి వరకూ ఎన్ని సందర్శించారో తెలుసుకుందాం.

విశ్వనాథ్ జ్యోతిర్లింగ (వారణాసి, ఉత్తరప్రదేశ్): ప్రధాని మోదీకి తన పార్లమెంటరీ నియోజకవర్గం వారణాసి పట్ల ప్రత్యేక అనుబంధం ఉంది. ఆయన కాశీ విశ్వనాథ్ ఆలయంలో అనేకసార్లు పూజలు చేశారు. ఆయన నాయకత్వంలో గ్రాండ్ కాశీ విశ్వనాథ్ ధామ్ కారిడార్ నిర్మించబడింది. ఇది ఈ ప్రదేశాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందేలా చేసింది.

సోమనాథ్ జ్యోతిర్లింగ (గుజరాత్): గుజరాత్‌లోని సోమనాథ్ ఆలయంతో ప్రధాని మోదీకి ప్రత్యేక అనుబంధం ఉంది. ఆయన సోమనాథ్ ట్రస్ట్ అధ్యక్షుడు కూడా. ఆయన అక్కడ అనేకసార్లు పూజలు చేశారు. ఆలయ పునర్నిర్మాణ పనులను కూడా పర్యవేక్షించారు.

కేదార్‌నాథ్ జ్యోతిర్లింగ (ఉత్తరాఖండ్): ప్రధానమంత్రి మోదీ అనేకసార్లు కేదార్‌నాథ్‌ను సందర్శించారు. 2019లో బాబా కేదార్ ముందు ధ్యానం చేస్తున్న ఆయన ఛాయాచిత్రాలతో దేశం దృష్టిని ఆకర్షించారు. ఆయన ప్రయత్నాలు కేదార్‌నాథ్ పునర్నిర్మాణ పనులను అపూర్వమైన వేగంతో అయ్యేలా చేశాయి.

మహాకాళేశ్వర జ్యోతిర్లింగ (ఉజ్జయిని, మధ్యప్రదేశ్): ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్ ఆలయాన్ని ప్రధాని మోదీ సందర్శించి.. మహాకాళ పబ్లిక్ కారిడార్‌ను ప్రారంభించారు. ఉజ్జయిని కేవలం తీర్థయాత్ర స్థలం మాత్రమే కాదు..శక్తి కేంద్రమని మోడీ చెప్పారు.

మల్లికార్జున జ్యోతిర్లింగం (శ్రీశైలం, ఆంధ్రప్రదేశ్): ప్రధాని మోదీ శ్రీశైలంలోని భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేశారు. ఈ ప్రదేశం జ్యోతిర్లింగం , శక్తిపీఠం రెండింటి సంగమం కావడం వల్ల కూడా ప్రత్యేకమైనది.

ఓంకారేశ్వర జ్యోతిర్లింగ (ఖాండ్వా, మధ్యప్రదేశ్): నర్మదా నది ఒడ్డున ఉన్న ఓంకారేశ్వర్ ఆలయాన్ని కూడా ప్రధాని మోదీ సందర్శించారు. ఏకాత్మ ధామ్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు.

భీమశంకర్ జ్యోతిర్లింగ (మహారాష్ట్ర): ప్రధాని మోదీ మహారాష్ట్ర పర్యటన సందర్భంగా ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటైన భీమశంకర్‌ను కూడా సందర్శించారు.

వైద్యనాథ్ జ్యోతిర్లింగ (డియోఘర్, జార్ఖండ్): 2022లో డియోఘర్ విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా బాబా వైద్యనాథ్ ధామ్‌లో వైద్యనాథ్ జ్యోతిర్లింగానికి ప్రత్యెక పూజలు చేశారు.

రామనాథస్వామి లింగం( రామేశ్వరం,తమిళనాడు): ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2024, 2025లో రామేశ్వరంలోని అరుళ్మిగు రామనాథస్వామి ఆలయాన్ని పలుమార్లు సందర్శించారు.

నాగేశ్వర లింగం(దారుకావనం, ద్వారక): 2013 లో ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ ద్వారక సమీపంలోని నాగేశ్వర్ ఆలయంలో ప్రార్థనలు చేసి, 64వ వన మహోత్సవం సందర్భంగా నాగేష్ వాన్‌ను ప్రారంభించారు.



		
		
			

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *