PLI scheme white goods extension: మరింత చవకగా ఏసీలు, LED బల్బులు.. PLI స్కీమ్ తెచ్చిన కేంద్ర ప్రభుత్వం

PLI scheme white goods extension: మనకు తెలుసు.. కేంద్రం 500కి పైగా పథకాలు అమలు చేస్తోంది. వాటిలో ఒకటి PLI స్కీమ్. ఇదేంటో.. దీని వల్ల ప్రజలకు ఏసీపీ, LED బల్బుల లాంటివి తక్కువ ధరకు ఎలా లభిస్తాయో తెలుసుకుందాం.కేంద్ర ప్రభుత్వం.. ఎయిర్ కండిషనర్లు, ఎల్‌ఈడి లైట్ల వంటి వైట్ గూడ్స్ కోసం ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) స్కీమ్‌లోని నాల్గవ రౌండ్ అప్లికేషన్ విండోను నవంబర్ 10 వరకూ పొడిగించింది. ఇలా పొడిగించాలని ఇండస్ట్రీ వర్గాలు కోరగా.. కేంద్రం సరే అని ఒప్పుకుంది. దానికి తోడు ఇప్పుడు ఇలాంటి తెల్లటి ప్రొడక్టులపై పెట్టుబడులు కూడా పెరుగుతున్నాయి. అందుకే కేంద్రం మంచి నిర్ణయం తీసుకుంది.డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (DPIIT) శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. దాని ప్రకారం ఈ పొడిగింపు నిర్ణయం.. వైట్ గూడ్స్ తయారీదారులకు మరిన్ని అవకాశాలు కల్పిస్తుంది. మరింత ఎక్కువగా వారు ఉత్పత్తులు చేపట్టేందుకు ఆసక్తి చూపిస్తారు. నిజానికి ఆక్టోబర్ 14 వరకే ఈ అప్లికేషన్ విండో అందుబాటులో ఉండేది.. దీన్ని మరో నెల దాకా పొడిగించడం వల్ల అందరికీ మేలు జరగనుంది.ఇది ఎలాంటి స్కీమ్?పీఎల్‌ఐ స్కీమ్‌ని కేంద్రం.. తెల్లటి ఉత్పత్తుల కోసం ఏప్రిల్ 2021లో ప్రారంభించింది. మొత్తం బడ్జెట్ రూ.6,238 కోట్లు. దీన్ని 2021-22 నుంచి 2028-29 వరకు ఏడు సంవత్సరాల వరకూ అమలు చేస్తారు. దేశీయ తయారీని పెంచడం, ఉత్పత్తులు స్థానికంగానే తయారయ్యేలా ప్రోత్సహించడం, ఏసీలు, LED లైటింగ్ విభాగాల్లో భారతదేశాన్ని ప్రపంచంతో పోటీ పడగల స్థాయికి చేర్చడం వంటివి ఈ స్కీమ్ ప్రధాన లక్ష్యాలు.కంపెనీలకు ప్రయోజనాలు:ఈ స్కీమ్ ద్వారా తయారీదారులకు ప్రయోజనం ఉంటుంది. వారు చేసే అమ్మకాలపై 6% నుంచి 4% వరకు ఇన్సెంటివ్‌లు పొందుతారు. ఇలా ఐదు సంవత్సరాల పాటు అదనపు ప్రయోజనాలు వారు పొందుతారు. ఇప్పటికే 24 ప్రముఖ కంపెనీలు ఈ స్కీమ్‌లో ఎంపిక అయ్యాయి. ఇవి దేశీయ ఉత్పాదకతను భారీగా పెంచుతున్నాయి.సమగ్ర అభివృద్ధి:ఈ స్కీమ్ ప్రయోజనాలను పొందడానికి కంపెనీలు.. ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ ప్రయోజనాలను ఎలాగైనా పొందాలని ఉత్పత్తిని బాగా పెంచాయి. పెట్టుబడులను పెంచాయి. అంతేకాదు.. విదేశీ కంపెనీలు కూడా భారతదేశంలో కొత్త ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నాయి. తద్వారా ఉద్యోగాల కల్పన జరుగుతోంది. పైగా ఇలాంటి ఉత్పత్తుల కోసం విదేశాలపై ఆధారపడటం బాగా తగ్గింది.సామాన్య ప్రజలకు ఏం ప్రయోజనం?:కంపెనీలకే కాదు.. సామాన్య ప్రజలకు కూడా ఈ స్కీమ్ వల్ల ప్రయోజనం కలుగుతుంది. ఎందుకంటే.. ఏసీలు, LED బల్బుల వంటి వాటిని కంపెనీలు భారీగా ఉత్పత్తి చేస్తుండటం వల్ల వాటికి ఉత్పాదక ఖర్చులు తగ్గుతున్నాయి. అలాగే కేంద్రం నుంచి ఇన్సెంటివ్స్ వస్తున్నాయి. దాంతో.. ఉత్పత్తులను తక్కువ ధరకు ప్రజలకు అందించగలుగుతున్నాయి. ఈ స్కీమ్ నవంబర్ 10 వరకూ అమలులో ఉంటుంది కాబట్టి.. నవంబర్ నెలాఖరు వరకూ.. ఏసీలు, LED బల్బుల వంటి వైట్ కలర్ ఉత్పత్తుల ధరలు తక్కువగా ఉండొచ్చు. ఆ తర్వాత ధర పెరిగే ఛాన్స్ ఉంటుంది.గత రౌండ్‌లలో ఈ స్కీమ్ కారణంగా ఉత్పత్తుల ధరలు 10-15శాతం తగ్గాయి. దాంతో ప్రజలకు తక్కువ ధరలో, ఎక్కువ ఉత్పత్తులు అందుబాటులోకి వచ్చాయి. వారు ఏ ప్రొడక్ట్ చవకగా లభిస్తే, దాన్ని కొనుకున్నారు. ఐతే.. నవంబర్ 10 తర్వాత ఈ స్కీమ్ అమలులో ఉండకపోతే.. వచ్చే సంవత్సరం నుంచి వైట్ గూడ్స్ ధరలు పెరిగే ప్రమాదం ఉంటుంది. మరి కేంద్రం ఏం చేస్తుందన్నది ఆసక్తికరం. ప్రస్తుతానికైతే.. చవక ధరలకే ఉత్పత్తులు లభిస్తాయి.ఈ స్కీమ్ భారతదేశ ‘మేక్ ఇన్ ఇండియా’ లక్ష్యాన్ని సాకారం చేస్తోంది. విదేశీ పెట్టుబడులు పెరుగుతున్నాయి. స్థానిక ఇన్నోవేషన్‌ని ప్రోత్సాహించడం ద్వారా టెక్నాలజీ అభివృద్ధి చెందుతోంది. ఇప్పటికే మొత్తం పెట్టుబడులు రూ.5,000 కోట్లు దాటాయి. ఈ రౌండ్‌తో మరో రూ. 2,000 కోట్లు వచ్చే అవకాశం ఉంది. ఇలా ఈ పొడిగింపు నిర్ణయం… భారత ఎలక్ట్రానిక్స్ విభాగాన్ని మరింత బలోపేతం చేస్తూ, ప్రజలకు చౌక ధరలకు, మెరుగైన ఉత్పత్తులను అందిస్తోంది.

