Pancreatic Cancer: ఈ 3 లక్షణాలుంటే ఆ క్యాన్సర్ కన్ఫామ్.. త్వరగా గుర్తించడం కష్టమే.. ఆలస్యం చేస్తే నూకలు చెల్లినట్లే!

ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ప్యాంక్రియాస్‌లో కణాలు పెరగడం వల్ల వచ్చే డేంజరస్ వ్యాధి. ప్రారంభ దశలో గుర్తిస్తే చికిత్స సులభం. WHO ప్రకారం, ఇది అత్యంత ప్రమాదకరం.
ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అంటే ప్యాంక్రియాస్‌లో క్యాన్సర్ కణాలు పెరగడం వల్ల వచ్చే ఒక డేంజరస్ వ్యాధి. ఇది చాలా త్వరగా వ్యాపించదు కానీ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కానీ అవగాహన లేకపోవడం వల్ల, ఈ క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య ఆందోళనకరంగా పెరుగుతోంది. ఎక్కువ మంది దాని లక్షణాలను గుర్తించకపోవడం వల్ల చివరి దశలో తెలియడంతో చికిత్స చాలా కష్టం అవుతుంది. అందువల్ల ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ నాలుగు దశల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం.
ఎందుకంటే ఈ క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తించినట్లయితే, చికిత్స పొంది క్యాన్సర్‌ను తగ్గించే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటుంది. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఏ దశలో శరీరంలో ఏ లక్షణాలు కనిపిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.మొదటి దశలో చిన్న చిన్న లక్షణాలు కనిపిస్తాయి కానీ చాలా మంది వాటిని మామూలు అనారోగ్యంగా తీసుకుంటారు. బలహీనత, తలనెత్తు, ఆకలి లేకపోవడం వంటి చిన్న లక్షణాలే మొదట్లో కనిపిస్తాయి.

రెండో దశలో కొంత స్పష్టమైన లక్షణాలు కనిపిస్తాయి. మలబద్ధకం, కామెర్లు, కాలేయం ఉబ్బడం మొదలవుతుంది. ఈ దశలో క్యాన్సర్ ప్యాంక్రియాస్ నుంచి కదిలి ఇతర అవయవాలపై ప్రభావం చూపిస్తుంది. పిత్తం ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఇది మలానికి రంగు మార్పు, జిడ్డుగా మారడం, వికారం లాంటివి కలిగించవచ్చు. మూడో దశలో క్యాన్సర్ దగ్గర్లోని రక్త నాళాలకు, శోషరస గ్రంథులకు వ్యాపించి ఉంటుంది. ఇంకా ఇది శరీరంలో దూర ప్రాంతాలకు చేరకపోయినా, చికిత్స కొంత కష్టతరం అవుతుంది.
నాలుగో దశలో క్యాన్సర్ ప్యాంక్రియాస్ నుంచి ఇతర అవయవాలకు వ్యాపించి ఉంటుంది. ముఖ్యంగా కాలేయం, ఊపిరితిత్తులు వంటి కీలకమైన భాగాలను ప్రభావితం చేస్తుంది. ఈ దశలో మందులతో మాత్రమే కాకుండా శస్త్రచికిత్స, కీమోథెరపీ వంటి చికిత్సలు అవసరమవుతాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అన్ని రకాల క్యాన్సర్లలో అత్యంత ప్రమాదకరమైనది. ప్యాంక్రియాస్‌లో క్యాన్సర్ కణాలు పెరిగినప్పుడు ఈ క్యాన్సర్ వస్తుంది. అయితే, ఈ వ్యాధి సాధారణంగా వృద్ధులలో ఎక్కువగా కనిపిస్తుంది.
స్త్రీలతో పోలిస్తే పురుషుల్లో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే వారు సాధారణంగా ఎక్కువగా స్మోకింగ్, డ్రికింగ్ చేస్తారు. ధూమపానం ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌కు ప్రధాన కారణం. ఎలా జాగ్రత్తపడాలో ఇప్పుడు తెలుసుకుందాం.రోజూ వ్యాయామం చేయాలి, యోగా చేయాలి. ప్రాసెస్ చేసిన ఆహారాలు తినొద్దు. ధూమపానం చేయవద్దు, అలాంటి వ్యక్తుల నుండి దూరంగా ఉండాలి. ఆకుపచ్చ కూరగాయలు ఎక్కువగా తినాలి. బరువు నియంత్రణలో ఉంచాలి. చక్కెర తక్కువగా తీసుకోవాలి. 45 ఏళ్ల తరువాత ఆరోగ్య పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలి.

ఈ రకంగా జీవనశైలి మార్చుకుంటే, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ లాంటి ఎన్నో ప్రాణాంతక వ్యాధుల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. దయచేసి వాటిని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణులను సంప్రదించండి)

