Our country is being dishonored.. A young woman was caught stealing in the US.. and then

రాష్ట్ర వార్త :

అమెరికాలో దొంగతనం చేస్తూ పట్టుబడిన భారతీయ యువతి ఏడ్చి క్షమాపణ చెప్పింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. వాస్తవానికి ఈ సంఘటన జనవరి 15, 2025న జరిగింది. అయితే యూట్యూబ్ ఛానెల్‌లో ఈ వీడియో షేర్ చేసిన తర్వాత యువతి చేసిన పని సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ వైరల్ వీడియోలో ఆ మహిళ పోలీసు అధికారుల ముందు మోకరిల్లి క్షమాపణ చెప్పినట్లు తెలుస్తుంది. ఆ యువతి దాదాపు 40 నిమిషాల పాటు ఈ స్థితిలోనే ఉందని అధికారులు తెలిపారు.

అమెరికాలోని టార్గెట్ స్టోర్ నుంచి దొంగతనం చేస్తూ పట్టుబడిన భారతీయ మహిళ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫుటేజ్ ఒక పోలీసు అధికారి బాడీక్యామ్ లో రికార్డ్ చేయబడింది. దీనిలో ఆ యువతి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన తర్వాత విచారణ సమయంలో ఏడుస్తూ క్షమాపణలు కోరుతూ కనిపిస్తుంది. వాస్తవానికి ఈ సంఘటన జనవరి 15, 2025 న జరిగింది. అయ్తీ ఇప్పుడు ఈ వీడియో యూట్యూబ్ ఛానెల్‌లో షేర్ చేయడంతో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ వైరల్ వీడియోలో ఆ మహిళ పోలీసు అధికారుల ముందు మోకరిల్లి ఏడుస్తున్నట్లు కనిపిస్తుంది. ఆ మహిళ దాదాపు 40 నిమిషాల పాటు ఈ స్థితిలోనే ఉందని అధికారులు తెలిపారు.

ఆ వీడియోలో ఆ యువతిని ఆమె భాష గురించి అడిగినప్పుడు.. ఆమె ఏడుస్తూ తాను గుజరాతీ అని తాను భారతదేశానికి చెందిన యువతిని అని చెప్పిందని.. అనువాదకుడి సహాయం తీసుకోవడానికి కూడా నిరాకరించిందని తెలుస్తుంది. పోలీసుల విచారణలో.. ఆ మహిళకు వాషింగ్టన్ డ్రైవింగ్ లైసెన్స్ ఉందని.. గతంలో కూడా ఆమె అదే దుకాణంలో దొంగతనం చేసిందని విచారణలో తేలింది. అయితే ఆమెను పోలీసులు పట్టుకోవడం ఇదే మొదటిసారి. దొంగిలించిన వస్తువులను అమ్మాలని ప్లాన్ చేస్తున్నట్లు కూడా ఆ మహిళ అంగీకరించింది.

మీడియా నివేదికల ప్రకారం పోలీసులు యువతిని హెచ్చరించిన తర్వాత వదిలేశారు. అయితే ఆ యువతి మళ్ళీ దుకాణంలో కనిపిస్తే.. ఆమెపై అనధికార ప్రవేశం కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరచాల్సి ఉంటుందని పోలీసులు హెచ్చరించినట్లు తెలుస్తోంది.

పూర్తి వీడియో ఇక్కడ చూడండి ఈ సంవత్సరం ఇల్లినాయిస్‌లోని మరో గుజరాతీ మహిళ టార్గెట్ స్టోర్ నుంచి $1300 విలువైన వస్తువులను దొంగిలించి.. పట్టుబడిన తర్వాత తాను డబ్బు చెల్లిస్తానని చెప్పింది. అప్పుడు వివాదం చెలరేగడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో కూడా వైరల్ అయింది.



		
		
			

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *