Onion Price Hike: ఉల్లిపాయలు, టమాటాలు స్టాక్ పెట్టుకోండి.. ధరలు భగ్గుమంటాయి!

Onion Price Hike: ఏవి ధరలు పెరుగుతాయో ముందే తెలిస్తే.. ఆ ఉత్పత్తుల్ని ముందే ఎక్కువగా కొనుక్కుంటే.. అప్పుడు ధరలు పెరిగినప్పుడు.. భారం నుంచి తప్పించుకోవచ్చు. అలాంటి పరిస్థితి ఇప్పుడు రాబోతోంది. ఉల్లిపాయలు, టమాటాల ధరలు ఆకాశాన్ని అంటబోతున్నాయి. చూస్కోండి మరి. ఇప్పుడు మార్కెట్లో ఉల్లిపాయలు, టమాటాల ధరలు తక్కువగానే ఉన్నాయి. కాబట్టి.. మనం కావాల్సినన్ని కొనుక్కుంటున్నాం. కానీ త్వరలోనే వీటి ధరలు విపరీతంగా పెరిగే పరిస్థితి కనిపిస్తోంది. అందుకే ఇప్పుడే మనం అలర్ట్ అయింతే.. ఈ ధరల భారం నుంచి తప్పించుకోవచ్చు. ఇంతకీ ఈ ధరలు ఎందుకు పెరుగుతాయి అనే దానికి కచ్చితమైన కారణం ఉండాలి కదా. అదేంటో చూద్దాం.ప్రతీ సంవత్సరం వర్షాకాలం రాగానే.. మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తాయి. ఊళ్లు, రోడ్లు అన్నీ జలమయం అవుతాయి. నడుము దాకా వర్షాపు నీరు వస్తుంది. మన దేశంలో ఉల్లిపాయలు, టమాటాల ఉత్పత్తిలో మహారాష్ట్ర ముందుంది. ఈ సంవత్సరం కూడా అక్కడ ఇటీవల భారీ వర్షాలు కురిశాయి. దాంతో.. ఉల్లి పంట మునిగిపోయింది. దాంతో.. అక్కడి నుంచి ఏపీ, తెలంగాణకు ఉల్లి, టమాటాల సప్లై తగ్గింది.ప్రస్తుతం టమాటాల ధర కేజీ రూ.30 నుంచి రూ.40 దాకా ఉంది. మే నెలలో రూ.24 ఉండేది. ఇప్పుడు రూ.40కి పెరిగింది. వచ్చే రెండు వారాల్లో ఈ ధర రూ.60 దాకా పెరిగి.. ఆ తర్వాత నెలలోగా రూ.80 నుంచి రూ.100కి చేరుతుందనే అంచనా ఉంది. దానికి తోడు.. వర్షాకాలం సీజన్లో టమాటాల పచ్చళ్లు ఎక్కువగా చేస్తారు. దాంతో టమాటాలకు డిమాండ్ బాగా పెరుగుతుంది. ఫలితంగా ధర పెరుగుతుంది. అంటే.. మళ్లీ మనం టమాటాల ధరలు పెరిగిపోయాయని ఆవేదన చెందే రోజులు రాబోతున్నట్లే.ఇక ఉల్లిపాయల పరిస్థితీ అలాగే ఉంది. ఈమధ్య ఉల్లిపాయల ధర కేజీకి రూ.6 దాకా పెరిగింది. ప్రస్తుతం కేజీ రూ.20 నుంచి 30 దాకా ఉంది. మున్ముందు ఇది రూ.40 నుంచి రూ.50కి చేరుతుందని అంచనా. మే నెలలో మహారాష్ట్రలో ఉల్లిపాయల ధర 20 శాతం పెరిగింది. దాంతో దేశవ్యాప్తంగా కూడా పెరుగుదల ఉంటుంది. అందువల్ల మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉల్లి ధరలు పెరగడం ఖాయం. సెంచరీ కొట్టినా ఆశ్చర్యం అక్కర్లేదు.
ఈ సంవత్సరం ఉల్లి, టమాటా పంటలు సరిగా లేవు. వర్షాలు చూస్తే.. భారీగా పడటం ఖాయం. మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ వర్షాలు లేవు గానీ.. మహారాష్ట్రలో బాగానే ఉంటున్నాయి. ఈ నెలంతా అక్కడ బాగానే కురుస్తాయి. దాంతో ఉల్లి పంట తడిసిపోయి, పాడైపోయే ప్రమాదం ఉంది. దాంతో సప్లై తగ్గుతుంది. క్వాలిటీ లేని ఉల్లి మార్కెట్లకు రాగలదు. దాంతో ధరలు పెరిగినా, నాణ్యత లేని ఉల్లిని మనం కొనుక్కోవాల్సి రావచ్చు.ఇప్పుడు మనం ఉల్లిపాయలు, టమాటాలను స్టాక్ పెట్టుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. కానీ టమాటాలను స్టాక్ పెడితే, నిల్వ ఉండవు. వారం, పది రోజుల్లోనే అవి పండిపోతాయి. ఆ తర్వాత వాడకపోతే పాడైపోతాయి. అందువల్ల వాటిని స్టాక్ పెట్టుకోవడం కష్టం. పచ్చి టమాటాలను కొని.. వేడి లేని పొడి ప్రదేశంలో విడివిడిగా ఉంచితే ఎక్కువ కాలం నిల్వ ఉంచాయని నిపుణులు చెబుతున్నారు.కొంతమంది టమాటాలను ఫ్రిజ్‌లో పెడితే నిల్వ ఉంటాయని అనుకుంటారు. కానీ టమాటాలు ఫ్రిజ్‌లో నిల్వ ఉండవు. క్రమంగా అవి కుచించుకుపోతాయి. అలాగే పుచ్చిపోతాయి. పైగి బాగానే ఉన్నట్లు కనిపిస్తాయి. కానీ లోపల తేడా వచ్చేస్తుంది. ఎందుకంటే.. టమాటాలకు ఆ చల్లదనం సెట్ కాదు. అందువల్ల మనం వాటిని బయటే పొడి ప్రదేశంలో ఉంచుకోవడం మేలు.
ఉల్లిపాయలను మనం భారీగా కొని స్టాక్ పెట్టుకోవచ్చు. ఐతే.. కొనేటప్పుడే.. తడి లేని పొడిగా ఉండే ఉల్లిపాయలు కొనుక్కోవాలి. వాటిని ఇంట్లో విడివిడిగా ఆరబెట్టాలి. పొడి ప్రదేశంలో ఆరబెట్టాలి. వాటిని 3 రోజులకు ఓసారి గమనిస్తూ ఉండాలి. ఏదైనా ఉల్లిపాయ పాడైతే.. దాన్ని వెంటనే తొలగించాలి. తద్వారా దాని నుంచి ఫంగస్ ఇతర ఉల్లికి చేరకుండా అడ్డుకోవచ్చు. ఈ వానాకాలం సీజన్లో ఉల్లి ధరలు పెరుగుతూనే ఉంటాయి. అందువల్ల మనం ఈ సీజన్‌కి కావాల్సినన్ని స్టాక్ పెట్టుకోవడం మేలని నిపుణులు చెబుతున్నారు.

News by : V.L