ఓలా ఎలక్ట్రిక్ పండగ ఆఫర్.. రూ. 49,999కే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్..

నవరాత్రి సందర్భంగా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు సెలబ్రేట్స్ ఇండియా పేరుతో అద్భుతమైన ఆఫర్లను ప్రకటించింది. ఈ ప్రత్యేకమైన ఆఫర్ కింద, కేవలం రూ. 49,999కి ఎలక్ట్రిక్ స్కూటర్ పొందవచ్చు. ఈ ఆఫర్లు పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ప్రతిరోజు కొన్ని గంటలపాటు మాత్రమే ఈ ప్రత్యేక ఆఫర్ లభిస్తుంది. పండగ సీజన్లో వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఓలా ఈ అద్భుతమైన ఆఫర్‌ను తీసుకొచ్చింది.
ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ కంపెనీ ఓలా అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. నవరాత్రి సందర్భంగా ఓలా సెలబ్రేట్స్ ఇండియా పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. సెప్టెంబర్ 23న ప్రారంభమై 9 రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఇందులో భాగంగా ముహూరత్ మహోత్సవ్ ద్వారా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ను రూ. 49,999కే కొనుగోలు చేయవచ్చు. ఈ ఆఫర్లు పరిమిత సంఖ్యలో ఉంటాయని కంపెనీ తెలిపింది. ప్రతి రోజు మొదటగా వచ్చే వారికే ప్రాధాన్యం ఉంటుందని తెలిపింది.
‘ముహూరత్ మహోత్సవ్’ అంటే ప్రతి రోజు కొన్ని గంటల పాటు ప్రత్యేక ఆఫర్లు ఉంటాయి. ఆ సమయంలో ఓలా షోరూమ్ కు వెళ్తే రూ. 49,999 కే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను కొనుగోలు చేయవచ్చు. ఈ సమయాలను ఓలా ప్రతి రోజు సోషల్ మీడియా ఖాతాల్లో వెల్లడిస్తుంది. పండగ సీజన్లో ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షించేందుకు ఈ ఆఫర్ తీసుకొచ్చింది.
ఓలా ఆఫర్లు ఇవే..
- ముహూరత్ మహోత్సవ్ సమయంలో ఓలా ఎస్1ఎక్స్ (2 kWh) స్కూటర్ ను రూ. 49,999కే సొంతం చేసుకోవచ్చు. దీని అసలు ధర రూ. 81,999 గా ఉంది.
- ఓలా రోడ్‌స్టర్ ఎక్స్(2.5 kWh) రూ. 49,999 కే లభిస్తుంది. దీని అసలు ధర రూ. 99,999గా ఉంది.
- ఓలా ఎస్1 ప్రో ప్లస్ (5.2 kWh) రూ. 99,999 కే లభిస్తుంది. దీని రెగ్యులర్ ప్రైజ్ రూ. 1,69,999 గా ఉంది.
- ఓలా రోడ్‌స్టర్ ఎక్స్ ప్లస్ (9.1 kWh)ను రూ. 99,999 కే కొనుగోలు చేయవచ్చు. సాధారణంగా దీని ధర రూ. 1,89,999 గా ఉంది. ఫెస్టివల్ ఆఫర్లో భాగం రూ. 90 వేల డిస్కౌంట్ లభిస్తోంది.
ఓలా ఇటీవలే వార్షిక ‘సంకల్ప్’ కార్యక్రమంలో సరికొత్త 4680 భారత్ సెల్ టెక్నాలజీతో కూడిన వాహనాలను లాంచ్ చేసింది. వీటిలో S1 ప్రో ప్లస్ (5.2 kWh), రోడ్‌స్టర్ X ప్లస్ (9.1 kWh) ఉన్నాయి. ఈ వాహనాల డెలివరీలు నవరాత్రి నుంచి ప్రారంభమవుతాయి. అలాగే, ఓలా కొత్త స్పోర్ట్స్ స్కూటర్ S1 ప్రో స్పోర్ట్‌ను రూ.1,49,999 ధరతో లాంచ్ చేసింది. దీని డెలివరీలు 2026 జనవరి నుంచి మొదలవుతాయి. ఓలా ఎలక్ట్రిక్ S1 స్కూటర్లు, రోడ్‌స్టర్ X మోటార్ సైకిళ్ల ధరలు రూ. 81,999 నుంచి రూ.1,89,999 వరకు ఉన్నాయి. పండగ సీజన్ సందర్భంగా సేల్స్ పెంచుకునేందుకే కంపెనీ డిస్కౌంట్లు అందిస్తోంది.

