ఆహా ఎంత అందంగా ఉందో..! కుర్రాళ్లకు కిక్కిచ్చిన అచ్చ తెలుగు హీరోయిన్

సోషల్ మీడియాలో తెగ హంగామా చేస్తోంది తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బ. ఎప్పటికప్పుడు తన ఫ్రెష్ అండ్ పెప్పర్ లుక్స్ షేర్ చేస్తూ కుర్రకారు మతిపోగొడుతోంది. సోషల్ మీడియాలో తెగ హంగామా చేస్తోంది తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బ. ఎప్పటికప్పుడు తన ఫ్రెష్ అండ్ పెప్పర్ లుక్స్ షేర్ చేస్తూ కుర్రకారు మతిపోగొడుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఫోటో షూట్ వైరల్ గా మారింది.కళ్ళజోడు పెట్టుకొని యమ క్యూట్ గా కనిపిస్తూనే లేలేత అందాలతో కనువిందు చేసింది ఈ అచ్చ తెలుగు అందం. ఈ పిక్స్ చూసి కుర్రకారు మైమరచిపోతున్నారు. వావ్, ఎంత అందమో, బ్యూటిఫుల్ అంటూ కామెంట్ల మోత మోగిస్తున్నారు. సినిమాల పరంగా బిజీ అవుతూనే సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెంచుకుంటోంది ఈషా. నిత్యం ఆమె ఫొటోస్ చూసేందుకు ఎగబడుతున్నారు ఫ్యాన్స్. దీంతో ఆన్ లైన్ వేదికలపై ఈషా హవా కనిపిస్తోంది. మోడలింగ్ చేస్తూ కెరీర్ ప్రారంభించిన ఈషా రెబ్బా.. ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ మూవీతో సినీ ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే యువత చూపు తనపై పడేలా చేసుకొని ఆ వెంటనే ‘అంతకు ముందు ఆ తర్వాత’ అనే సినిమా చేసి హీరోయిన్ గా మంచి మార్కులు కొట్టేసింది ఈ తెలుగమ్మాయి. ఫేమస్ హీరోయిన్ కానప్పటికీ ఈషా రెబ్బా అన్నా, ఆమె గ్లామర్ అన్నా పరిచయం లేని ప్రేక్షకుడు లేడని చెప్పడంలో అతిశయోక్తి లేదు. వెండితెరపై తనదైన గ్లామర్ ఒలకబోస్తూ ఫేమ్ కొట్టేసిన ఈ బ్యూటీకి అదృష్టం మాత్రం కలసి రావడంలేదు. మెయిన్ హీరోయిన్ గా ఎలాగూ సక్సెస్ రావడం లేదని.. సెకండ్ హీరోయిన్ గానూ చేయడానికి ముందుకొచ్చింది ఈ అందాల ఈషా. ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ‘అరవింద సమేత.. వీరరాఘవ’, అక్కినేని వారసుడి ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ వంటి చిత్రాల్లో నటించింది. కావాల్సినంత అందం ఉన్నా కూడా ఎందుకో ఈషా రెబ్బకు తెలుగు హీరోలు సరైన అవకాశాలు ఇవ్వడం లేదనే చెప్పాలి. అందుకే వెబ్ సిరీస్‌లతో పాటు పక్క ఇండస్ట్రీలపై ఫోకస్ పెట్టింది ఈ తెలుగు అందం. మోడ్రన్ యుగంలో రాణించడం కోసం వెబ్ సిరీస్‌ల బాట పట్టిన ఈషా.. ఇప్పటికే పలు సిరీస్‌లకు సైన్ చేసిందట. ఎలాగైనా తన కెరీర్ గాడిలో పెట్టుకొని స్టార్ స్టేటస్ పట్టేయాలని శ్రమిస్తోంది. ఈ మేరకు కెమెరా ముందు గ్లామర్ వడ్డించడానికి కూడా రెడీ అని చెప్పకనే చెబుతోంది.

News by : V.L