Not a mother, but a demon.. infatuated with her lover.. and a daughter..

ఉత్తరప్రదేశ్ బులంధ్‌షహర్ జిల్లాలో దారుణం ఘటన వెలుగు చూసింది. ప్రియుడితో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందనే కారణంతో ఒక మహిళ ఏకంగా తన కుమార్తెనే అతి కిరాతకంగా హత్య చేసింది. తర్వాత ఏమి ఎరగనట్టు మిస్సింగ్‌ కంప్లైంట్‌ ఇచ్చింది. కొన్ని రోజులకు బాలిక మృతదేహం లభించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పెళ్లైన కూడా వివాహేతర సంబంధాలు పెట్టుకొని ప్రియుడు మోజులో పడిన కొందరు మహిళలు.. వారి కోసం ఏకంగా రక్త సంబంధాలనే తెంచుకుంటున్నారు. తాజాతా ఇలాంటి ఒక ఘటనే ఉత్తరప్రదేశ్‌లో వెలుగు చూసింది. ప్రియుడితో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందనే కారణంతో ఒక మహిళ ఏకంగా తన మూడేళ్ల కుమార్తెనే అతి కిరాతకంగా హత్య చేసింది. ఆ తర్వాత బాలిక మృతదేహాన్ని సమీపంలోని ఒక కాలువలో పడేసింది. తర్వాత ఏమి ఎరగనట్టు మిస్సింగ్‌ కంప్లైంట్‌ ఇచ్చింది. కొన్ని రోజులకు బాలిక మృతదేహం లభించడంతో ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులకు అసలు విషయం తెలిసింది. దీంతో నిందితురాలిని, ఆమె ప్రియుడిని అరెస్ట్ చేసి పీఎస్‌కు తరలించారు పోలీసులు.పోలీసులు తెలిపిన వివారాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని నగౌరా ప్రాంతానికి చెందిన సీమా అనే మహిళకు కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. ఈమెకు దివ్యాంశి అనే మూడేళ్ల కుమార్తె కూడా ఉంది. సీమా గత కొన్ని రోజులుగా యతేంద్ర అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకొని అతనితోనే కలిసి జీవిస్తుంది. అయితే తన కుమార్తె వల్లే ప్రియుడితో తరచూ గొడవలు జరుగుతున్నాయని, తమ సుఖమైన జీవితానికి కూతురే అడ్డంగా ఉందని భావించిన ఇద్దరూ బాలికను హత్య చేసేందుకు ప్లాన్ వేశారు.

పతకం ప్రకారం బాలికపై దాడి చేసి హత్య చేశారు. ఆ తర్వాత శవాన్ని నరౌరా సమీపంలోని గంగా కాలువలో పడేశారు.తర్వాత ఏమి ఎరగనట్టు స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి మిస్సింగ్‌ కంప్లైంట్ ఇచ్చింది. అంతటితో ఆగకుండా అహ్మద్‌గఢ్‌కు చెందిన లల్తేష్, అతని సహచరుల తన కుమార్తెను కిడ్నాప్ చేశారని ఆరోపించింది.కొన్ని రోజుల తర్వాత బాలిక మృతదేహం కాలువలో లభించడంతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా అనుమానితులను గుర్తించారు. దీంతో బాధితురాలి తల్లి, ప్రియుడిని అదుపులోకి తీసుకొని తమదైనశైలిలో విచారించారు. దీంతో నిందితులు నిజాన్ని అంఘీకరించారు. ఇక ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *