ముద్దుగుమ్మ కాదు.. బొద్దుగుమ్మ..ఈ హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా..?

తెలుగు యాంకర్స్‌లో శ్రీముఖి కూడా ఒకరు. హీరోయిన్ అవుదామని ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శ్రీముఖి.. తొలుత కొన్ని సినిమాల్లో హీరోయిన్గా నటించింది. ప్రేమ ఇష్క్ కాదల్,చంద్రిక,ధనలక్ష్మి తలుపు తడితే,ఆంధ్రా పోరి ,సవిత్రి ,బాబు బాగా బిజీ ,కుటుంబ కథా చిత్రం,క్రేజీ అంకుల్స్ వంటి సినిమాల్లో శ్రీముఖి హీరోయిన్గా నటించింది.
జులాయి సినిమాలో అల్లు అర్జున్ చెల్లెలుగా నటించి మంచి గుర్తింపు దక్కించుకుంది. దర్శకుడు త్రివిక్రమ్ ఇచ్చిన సూచనలో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది ఈ హాట్ బ్యూటీ. వెండితెర కన్నా బుల్లితెరపై శ్రీముఖి సూపర్ హిట్ అయింది. పలు షోలకు హోస్ట్‌గా వ్యవహరిస్తూ అతి తక్కువ కాలంలోనే ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
యాంకర్స్ కూడా ఇంత గ్లామర్‌గా కనిపిస్తారని శ్రీముఖిని చూస్తే అర్థం అవుతుంది. తనదైన యాంకరింగ్‌తో చాలామంది అభిమానులను సొంతం చేసుకుంది ఈ హాట్ బ్యూటీ. బుల్లితెర మీదన వచ్చిన క్రేజ్‌తో బిగ్‌బాస్ రియాల్టీ షోలో కూడా ఎంట్రీ ఇచ్చింది. బిగ్‌బాస్ విన్నర్ అవుతుందని భావించినప్పటికీ రన్నరప్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.అయితే గత కొంతకాలంగా శ్రీముఖి పెళ్లి గురించి అనేక వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఆ మధ్య యాంకర్ ప్రదీప్‌తో శ్రీముఖి ప్రేమలో ఉందని.. త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. అలాంటిది ఏమీ లేదని..తామిద్దరం మంచి స్నేహితులం మాత్రమే అని ప్రదీప్, శ్రీముఖి ఇద్దరూ దీనిపై వివరణ ఇచ్చారు. ఇదిలా ఉంటే శ్రీముఖి సోషల్ మీడియా యమ యాక్టివ్‌గా ఉంటోంది. శ్రీముఖికి సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంది.తన వ్యక్తిగత విషయాలతో పాటు, తన షోలకు సంబంధించిన ఆప్టేట్స్ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటుంది.

News by : V.L
