No matter what you do, open pores won’t reduce. If you try the packs mentioned now, black and white heads will also reduce.

వయసు పెరిగేకొద్దీ ఎన్నో స్కిన్‌ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అందులో బ్లాక్ అండ్ వైట్ హెడ్స్‌తో పాటు ఓపెన్ పోర్స్ కూడా ఉంటాయి. వీటిని దూరం చేయడానికి చాలా మంది క్రీమ్స్‌, లోషన్స్ రాస్తుంటారు. వీటి బదులు నేచురల్‌గానే ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసుకునేందుకు కొన్ని టిప్స్ హెల్ప్ చేస్తాయి. ఆ చిట్కాలు ఏంటో షేర్ చేస్తున్నారు హంసాజీ. వీటిని వాడడం వల్ల నేచురల్‌గానే ముఖంపై ఉన్న బ్లాక్ అండ్ వైట్ హెడ్స్ తగ్గడమే కాకుండా ఓపెన్ పోర్స్ కూడా తగ్గుతాయి. మరి ఆ టిప్స్ ఏంటో తెలుసుకోండి.

టీనేజ్‌లోకి రాగానే స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందులో ఓపెన్ పోర్స్ ఒకటి. వాటితో పాటు మొండిగా మారే బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్‌తో తీవ్రంగా బాధపడతారు. వీటిని దూరం చేసుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా సమస్య తగ్గదు. పొల్యూషన్, సరిగ్గా లేని స్కిన్ కేర్ కారణంగా చాలా మంది బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్‌ పెరుగుతూనే ఉంటాయి. ఎలా అయినా సమస్యని తగ్గించుకోవాలనుకునేవారు మార్కెట్లో దొరికే రకరకాల ప్రోడక్ట్స్ వాడతారు. దాంతో డబ్బు ఖర్చు మాత్రమే కాదు. బోలెడన్నీ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. అందుకే, అలా కాకుండా మరికొన్ని ప్రయత్నాలు చేయొచ్చు. ఇంట్లోని పదార్థాలని ట్రై చేసి సమస్యని తగ్గించుకోవచ్చు. అలాంటి కొన్ని ఇంటి చిట్కాల గురించి హంసాజీ షేర్ చేస్తున్నారు. అవేంటో తెలుసుకోండి.

బ్లాక్ హెడ్స్ ఆయిలీ స్కిన్ వారికి వస్తాయి. ఎక్కువగా ఆయిల్ ఉత్పత్తి అయినప్పుడు ఎక్కువగా ఉండే ఆయిల్ పోర్స్‌ని మూసివేస్తుంది. దీంతో అక్కడ బ్లాక్ హెడ్స్ పేరుకుపోతాయి. వీటిని నేచురల్‌గా క్లీన్ చేసేందుకు ఓట్స్ ప్యాక్ హెల్ప్ చేస్తుంది. 
ఏం చేయాలి?
ఓట్స్‌ని కోర్స్‌గా గ్రైండ్ చేయాలి. అందులో రోజ్ వాటర్ కలపాలి. దీనిని సమస్య ఉన్న చోట అప్లై చేయాలి. దీనిని అలానే 20 నిమిషాల పాటు వదిలేసి కాస్తా రబ్ చేస్తూ నీటితో క్లీన్ చేసుకోవాలి. దీనిని రోజూ ముఖాన్ని కడిగేటప్పుడు ట్రై చేయండి. అదే విధంగా, స్టీమింగ్ కూడా బ్లాక్‌హెడ్స్‌ని దూరం చేయడంలో హెల్ప్ చేస్తుంది. స్టీమింగ్స్టీమింగ్ చేయడం వ్ల స్కిన్ సాఫ్ట్‌గా అవుతుంది. పోర్స్ ఓపెన్ అవుతాయి. ఆ టైమ్‌లో బ్లాక్ హెడ్స్‌ని ఈజీగా రిమూవ్ చేయొచ్చు. స్టీమింగ్ మరింత ఎఫెక్టివ్‌గా పనిచేసేందుకు మీరు స్టీమ్ చేసే నీటిలో 2 నిమ్మ ముక్కలు, టీ స్పూన్ చందనం పొడిని వేయొచ్చు.

  1. వైట్ హెడ్స్ కూడా చర్మ రంధ్రాల్ని మూసివేస్తాయి. ఆయిల్‌తో పాటు డెడ్ స్కిన్ సెల్స్ పోర్స్‌లోనే ఉండిపోవడాన్ని వైట్ హెడ్స్ అంటారు. వీటిని నేచురల్‌గానే దూరం చేసుకోవాలంటే ఫేస్ ప్యాక్స్ హెల్ప్ చేస్తాయి. వీటితో పాటు ఫేస్ మాస్క్, స్టీమింగ్, క్లెన్సింగ్‌లు హెల్ప్ చేస్తాయి. లికోరైస్, యష్టిమధు ఫేస్‌ప్యాక్స్ మనకి హెల్ప్ చేస్తాయి. ఇవి మనకి ఆయుర్వేద షాపుల్లో దొరుకుతాయి.
  2. దీనికోసం 1 టేబుల్ స్పూన్ యష్టిమధు పౌడర్‌ అంతే పరిమాణాలో లికోరైస్ పౌడర్ తీసుకోవాలి.
  3. అందులోనే 1 టీస్పూన్ తేనె వేసుకోవాలి.
  4. హాఫ్ టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ వేసి బాగా మిక్స్ చేయాలి.
  5. ముఖంపై సమస్య ఉన్న చోట దీనిని రాయాలి.
  6. అలానే 15 నిమిషాలు ఉంచి ముఖాన్ని నీటితో క్లీన్ చేయాలి.


		
		
			

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *