New Electric Scooter: మార్కెట్‌లోకి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్, ధర రూ.50 వేల కన్నా తక్కువే, స్టైలిష్ లుక్, అదిరే ఫీచర్లు!

ఎలక్ట్రిక్ స్కూటర్ కొనే వారికి గుడ్ న్యూస్. కొత్త మోడల్ మార్కెట్‌లోకి వచ్చింది. ZELIO E Mobility తాజాగా Little Gracyను మార్కెట్‌లో లాంచ్ చేసింది. ఇది తక్కువ స్పీడ్, లైసెన్స్-ఫ్రీ ఎలక్ట్రిక్ స్కూటర్, 10-18 ఏళ్ల యువ రైడర్ల కోసం ప్రత్యేకంగా రూపొందింది. దీని ధర ₹49,500 నుండి ప్రారంభమవుతుంది, స్కూటర్ వినియోగదారులకు పర్యావరణ హిత, సుస్థిర రవాణాను అందిస్తుంది.
Little Gracy మూడు వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. ప్రతి వేరియంట్ వేర్వేరు బ్యాటరీ రేంజ్ మరియు ఛార్జింగ్ సమయం కలిగి ఉంది. 48V/32AH లీడ్ అసిడ్: ₹49,500, 55-60 km రేంజ్, ఛార్జింగ్ సమయం 7-8 గంటలు. అలాగే 60V/32AH లీడ్ అసిడ్: ₹52,000, 70 km రేంజ్, ఛార్జింగ్ సమయం 7-9 గంటలు. ఇంకా 60V/30AH లిథియం-ఐయాన్: ₹58,000, 70-75 km రేంజ్, ఛార్జింగ్ సమయం 8-9 గంటలు. ప్రతి మోడల్ 48/60V BLDC మోటార్, 80 kg బరువు, 150 kg లోడింగ్ కెపాసిటీ కలిగి ఉంది. టాప్ స్పీడ్ 25 km/h, ఒక్కసారి ఛార్జ్ చేసి 1.5 యూనిట్ల విద్యుత్ మాత్రమే అవసరం. దీని వల్ల సమర్థవంతమైన, ఆర్ధికంగా లాభదాయకమైన రైడింగ్ సాధ్యం.
