Nellore: కోరికలు తీరే రొట్టెల పండుగ.. నెల్లూరులో భక్తుల సందడి..!

నెల్లూరులోని బారాషహీద్ దర్గా రొట్టెల పండుగ 400 ఏళ్ల చరిత్ర కలిగి ఉంది. దేశ, విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. నెల్లూరు నగరం ఇప్పుడు ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడుతోంది.. సుమారు 400 ఏళ్ల చరిత్ర కలిగిన ప్రసిద్ధ బారాషహీద్ దర్గా రొట్టెల పండుగ ఈసారి కూడా వైభవంగా కొనసాగుతోంది. ఈ రొట్టెల పండుగలో పాల్గొనేందుకు దేశ, విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. తమ కోరికలు తీరుతాయన్న నమ్మకంతో నెల్లూరుకు భక్తులు చేరుకుంటున్నారు.
ఈ రొట్టెల పండుగ ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ భక్తులు స్వర్ణాల చెరువులో పవిత్ర స్నానం చేసి, తాము కోరుకునే కోర్కెలకు అనుగుణంగా రొట్టెలను తీసుకుంటారు. ఆరోగ్యానికి, కల్యాణానికి, విద్యకు, ఉద్యోగానికి, వ్యాపారానికి, సంతానానికి ఇలా విభిన్న రకాల రొట్టెలు అందుబాటులో ఉంటాయి. ఎవరికి ఏ కోరిక ఉంటే.. ఆ రొట్టెను మొక్కుకొంటారు. ఇక కోరిక తీరితే వచ్చే ఏడాది అదే రొట్టెను తిరిగి చెల్లించడం
ఈ ఏడాది రొట్టెల పండుగ ఐదు రోజుల పాటు జరుగుతుంది. తొలిరోజు సొందల్ మాలితో ప్రారంభమై, రెండో రోజు గంధ మహోత్సవం, మూడో రోజు ప్రధాన రొట్టెల పండుగ, నాలుగో రోజు తహనీల్ ఫాతహా, ఐదో రోజు ముగింపు ఉత్సవం ఘనంగా జరగనున్నాయి. తొలి రోజు నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో దర్గా వద్దకు తరలివచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వం ఈ పండుగను అధికారికంగా నిర్వహిస్తోంది. పెద్ద ఎత్తున భక్తులు వస్తారని ఊహించి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. భక్తుల కోసం 70 సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు, 1600 మంది పోలీసులు బందోబస్తు విధులు నిర్వహిస్తున్నారు. స్వర్ణాల చెరువులో భక్తులు సురక్షితంగా స్నానం చేయడానికి గజ ఈతగాళ్లు, బోట్లతో ప్రత్యేక గస్తీ ఏర్పాటు చేశారు.

