అమరావతి/కొలంబో: అటు ఏపీ పాలిటిక్స్‌లో ఫుల్ బిజీగా ఉండే యువ మంత్రి నారా లోకేష్, ఇటు క్రికెట్ గ్రౌండ్‌లో టీమిండియా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను చిత్తు చేస్తుంటే ప్రత్యక్షంగా చూసి మురిసిపోయారు. కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా జరిగిన భారత్-పాక్ హై-వోల్టేజ్ పోరులో లోకేష్ తన స్నేహితులు, టీడీపీ నేతలతో కలిసి సందడి చేశారు.
టీమిండియా జెర్సీలో.. సొంత పేరుతో!
ఈ మ్యాచ్ కోసం ప్రత్యేకంగా కొలంబో వెళ్లిన నారా లోకేష్, టీమిండియా బ్లూ జెర్సీ ధరించి స్టేడియంలో మెరిశారు. తన పేరు ఉన్న జెర్సీని ధరించి, చేతిలో త్రివర్ణ పతాకాన్ని ఊపుతూ భారత జట్టుకు గట్టి మద్దతు పలికారు. “కోట్లాది మంది భారతీయులు ప్రాణప్రదంగా భావించే ఇండియా-పాక్ పోరును ప్రత్యక్షంగా చూడటం సంతోషంగా ఉంది” అంటూ ఆయన సోషల్ మీడియాలో పంచుకున్న ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్‌కు లోకేష్ ఫిదా..
భారత జట్టు 61 పరుగుల భారీ విజయం సాధించిన అనంతరం లోకేష్ టీమిండియాకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యంగా 77 పరుగులతో వీరవిహారం చేసిన ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఇషాన్ కిషన్‌పై ప్రశంసల జల్లు కురిపించారు.
“ఇషాన్ కిషన్ భయం లేని బ్యాటింగ్ అద్భుతం. అతని ఇన్నింగ్స్ వల్లే భారత్ ఈ స్థాయి విజయాన్ని అందుకుంది. బౌలర్లు కూడా అదరగొట్టారు. ఈ గెలుపు భారత గౌరవాన్ని ప్రపంచ దేశాల్లో మరింత పెంచింది. ఇదే ఊపుతో వరల్డ్ కప్ ముద్దాడాలి” అంటూ లోకేష్ ఆకాంక్షించారు.
సూపర్-8 సంబరాలు.. వీడియో వైరల్!
పాకిస్థాన్‌పై గెలిచిన తర్వాత లోకేష్ తన బృందంతో కలిసి స్టేడియంలో సంబరాలు చేసుకున్న వీడియోను కూడా షేర్ చేశారు. భారత్ సూపర్-8కు దూసుకెళ్లడంతో అభిమానుల కేరింతల మధ్య లోకేష్ కూడా విక్టరీని ఎంజాయ్ చేయడం విశేషం. ప్రస్తుతం లోకేష్ ‘క్రికెట్ ప్రేమ’కు సంబంధించిన ఈ పోస్ట్‌లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

