Mouth Cancer: మీ నోట్లో ఈ మార్పులు వస్తున్నాయా..? నోటి క్యాన్సర్ కావచ్చు, జాగ్రత్త..!

మీ నోట్లో ఈ మార్పులు వస్తున్నాయా..? నోటి క్యాన్సర్ కావచ్చు, జాగ్రత్త..! Oral Cancer: మన దేశంలో ఎక్కువగా నమోదవుతున్న క్యాన్సర్లలో నోటి క్యాన్సర్ లేదా ఓరల్ క్యాన్సర్ ఒకటి. మహిళలతో పోలిస్తే పురుషుల్లో ఈ మహమ్మారి కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. పొగాకు, పాన్ మసాలా నమలడం వంటి అలవాట్ల కారణంగా చాలామంది ఓరల్ క్యాన్సర్ బారిన పడుతున్నారు.ఇది పెదవులు, చిగుళ్లు, నాలుక, చెంపలు, నోటి పైభాగంతో సహా నోటి కుహరాన్ని దెబ్బతీస్తుంది. దీంతో నోట్లో అసాధారణ కణజాలాలు పెరిగి క్యాన్సర్‌గా మారతాయి. అయితే, ముందుగానే గుర్తించి తగిన ట్రీట్మెంట్ తీసుకుంటే, ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. ఓరల్ క్యాన్సర్ లక్షణాలేంటో చూద్దాం. నోట్లో పుండ్లు
నోటి పూత (Mouth Sores) లేదా పుండ్లు (Ulcers) ఓరల్ క్యాన్సర్ లక్షణం. గుట్కా, పాన్ మసాలా, పొగాకు వంటివి నమలడం వల్ల నోట్లోని పలుచైన రక్షణాత్మక పొర పూర్తిగా దెబ్బతిని పూత ఏర్పడుతుంది. దీంతో తక్కువ కారం ఉండే ఆహారాలు తిన్నా నోట్లో బాగా మంట పుడుతుంది. మింగడంలో ఇబ్బంది (డిస్ఫాగియా)
ఏదైనా ఆహారాన్ని మింగేటప్పుడు ఇబ్బంది కలగడం, నొప్పి పుట్టడం వంటి అనుభవాలు క్యాన్సర్‌కి సంకేతాలు. రుచించని ఆహారాన్ని తిన్నట్లు అనిపించడం, జీర్ణం కాని ఆహారం తిరిగి బయటకు రావడం వంటివి గొంతు లేదా అన్నవాహిక (Esophageal) క్యాన్సర్‌ను సూచిస్తాయి.స్వరంలో మార్పులు
నోటి క్యాన్సర్ అటాక్ అయ్యే ముందు బాధితుల గొంతు మారవచ్చు. ఎక్కువ రోజులు గొంతు బొంగురు పోవడం, వాయిస్ పిచ్ తగ్గిపోవడం వంటి మార్పులు నాసికా, నాసోఫారింజియల్, లారింజియల్, వోకల్ కార్డ్స్ క్యాన్సర్‌ని సూచిస్తాయి. నోటి దుర్వాసన (హాలిటోసిస్)
నోటి పరిశుభ్రత పద్ధతులు పాటిస్తున్నప్పటికీ కొందరి నోటి నుంచి దుర్వాసన వస్తుంటుంది. నాలుక లేదా దవడలో పెరిగే కణితులు ఇలా దుర్వాసనను వెదజల్లుతాయి. మీ నోటి దుర్వాసన ఎప్పటికీ తగ్గకపోతే క్యాన్సర్ టెస్టులు చేయించుకోవాలి.

