Morning Tea: వాతావరణం చల్లగా ఉందని టీ తాగుతున్నారా? ఈ చిన్న తప్పుతో ప్రాణాలు గాల్లోకి పోవడం గ్యారెంటీ!

వాతావరణం చల్లగా ఉందని టీ తాగుతున్నారా? టీ చేసేప్పుడు చేసే ఈ చిన్న తప్పు వల్ల ప్రాణాలే గాల్లోకి! మనలో చాలామంది టీ ఫిల్టర్లను ఉపయోగిస్తారనే సంగతి తెలిసిందే. టీ వడగట్టటానికి ఉపయోగించే ఈ టీ ఫిల్టర్ల వల్ల ఎన్నో ప్రమాదకర వ్యాధులు వస్తాయని శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది.మార్కెట్లో టీ ఫిల్టర్లు తక్కువ ధరకే అందుబాటులో ఉండగా వీటిని వాడటం వల్ల మనం తాగే టీలో మైక్రో ప్లాస్టిక్స్ కలిసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి.ప్రతిరోజూ ఉపయోగించే ఈ టీ ఫిల్టర్లు క్యాన్సర్ తో పాటు ఎన్నో ప్రమాదకర వ్యాధులకు ప్రత్యక్షంగా పరోక్షంగా కారణం కావడంతో పాటు మన శరీరంలోని ప్రధాన అవయవాలకు హాని కలుగుతుంది.సాధారణంగా వీటిని తయారు చేయడానికి లో క్వాలిటీ ప్లాస్టిక్ ను ఉపయోగిస్తారు. కొన్ని సంస్థలు ఏకంగా రీసైకిల్ చేసిన ప్లాస్టిక్ ను వీటి తయారీ కోసం ఉపయోగించడం జరుగుతుంది.
టీ ఫిల్టర్ లో వేడి వేడి టీ పోసిన సమయంలో కొన్ని ప్రమాదకర కెమికల్స్ సైతం అందులో కలిసే అవకాశం ఉంది. ప్రతిరోజూ టీ తాగే వాళ్ళు ఈ విషయాలను గుర్తు పెట్టుకుంటే భవిష్యత్తులో కొత్త ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా మనల్ని మనం రక్షించుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. స్టీల్ తో తయారు చేసిన క్వాలిటీ టీ ఫిల్టర్లను ఉపయోగించడం వల్ల ఈ సమస్యను సులువుగా అధిగమించే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.
మనలో కొంతమంది హోటల్స్ లో టీ తాగడానికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అలాంటి వాళ్లు సైతం అక్కడ ఎలాంటి టీ ఫిల్టర్ ను వాడుతున్నారో తప్పనిసరిగా గమనించాలి. మన కుటుంబ సభ్యులకు ప్లాస్టిక్ టీ ఫిల్టర్ వాడటం వల్ల కలిగే నష్టాలు, దుష్ప్రభావాల గురించి అవగాహన కల్పిస్తే వాళ్లలో సైతం మార్పు వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుందని కచ్చితంగా చెప్పవచ్చు. స్టీల్ టీ ఫిల్టర్ ఖరీదు ఎక్కువ అని సాధారణమైన వాటిని వాడితే మాత్రం దీర్ఘకాలంలో ఎన్నో ఇబ్బందులు పడాల్సి ఉంటుంది.

ప్లాస్టిక్ వస్తువులను ఎంత తక్కువగా వినియోగిస్తే మన ఆరోగ్యానికి అంత మంచిదని చెప్పవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ఈ విషయాల గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. టీ ఫిల్టర్ క్లీనింగ్ టిప్స్ ఇప్పుడు తెలుసుకుందాం.. ఒక గిన్నెలో వేడి నీటిని తీసుకొని, అందులో అర్ధ టీస్పూన్ బేకింగ్ సోడా కొన్ని చుక్కల నిమ్మకాయ జోడించండి. ఇప్పుడు స్ట్రైనర్‌ను కొంతసేపు అందులో నానబెట్టండి. దీని వల్ల పేరుకుపోయిన నల్లటి పొర నెమ్మదిగా బయటకు వస్తుంది. ఆలా స్ట్రైనర్ కొత్తదానిలా మారుతుంది. మరకలు చాలా పాతవి అయితే, దీన్ని కొంతసేపు ఉడకబెట్టి, టూత్ బ్రష్‌తో శుభ్రం చేయవచ్చు.
అలాగే, వెనిగర్ కూడా ప్రభావవంతమైన పరిష్కారం. ఒక గిన్నె గోరువెచ్చటి నీటిలో 1-2 టీస్పూన్ల వెనిగర్ కలిపి, స్ట్రైనర్‌ను కొంతసేపు ఉంచండి. వెనిగర్‌లోని బలమైన ఆమ్లం మొండి మరకలను తగ్గిస్తుంది. తర్వాత, టూత్ బ్రష్ లేదా పాత బ్రష్‌తో సున్నితంగా రుద్దండి, మరకలు తొలగిపోతాయి మరియు మెష్ మళ్లీ తెరుచుకుంటుంది.డిష్ వాషింగ్ లిక్విడ్ మరియు ఉప్పు కలయికను కూడా ప్రయత్నించవచ్చు. ఒక టీస్పూన్ డిష్ వాష్ లిక్విడ్ మరియు కొద్దిగా ఉప్పు కలిపి స్ట్రైనర్‌పై అప్లై చేసి 10 నిమిషాల తర్వాత బ్రష్‌తో రుద్దండి.

