అప్పుల్లో మోహన్‌బాబు కుమార్తె.. నాన్న ఆ ఇల్లు రాయలేదంటూ మంచు లక్ష్మీ షాకింగ్‌గా

తెలుగు చిత్ర పరిశ్రమలోని పెద్ద కుటుంబాల్లో మంచు ఫ్యామిలీ కూడా ఒకటి. ఎన్నో కష్టాలు పడి, తన ప్రతిభ, క్రమశిక్షణతో తన కుటుంబాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చారు డాక్టర్ మంచు మోహన్ బాబు. చిన్న చిన్న వేషాలు వేసుకుంటూ విలన్‌గా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, నిర్మాతగా ఇండస్ట్రీలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. ఆయన వారసులుగా మంచు లక్ష్మీ, మంచు విష్ణు, మంచు మనోజ్‌లు పరిశ్రమలో అడుగుపెట్టి తమకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు.
మంచు ఫ్యామిలీలో గొడవలు గత కొద్దినెలలుగా మంచు ఫ్యామిలీ వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. విష్ణుకు- మనోజ్‌కు, మోహన్ బాబుకు – మనోజ్‌కు పడటం లేదంటూ విషయం కోర్టుల వరకు వెళ్లొచ్చింది. ఆస్తులతో పాటు తిరుపతిలోని శ్రీ విద్యానికేతన్, మోహన్ బాబు యూనివర్సిటీల విషయంలో వారసుల మధ్య గొడవలు చోటు చేసుకున్నాయి. పోలీస్ స్టేషన్లు, కలెక్టర్ కార్యాలయంలో విచారణలు జరిగాయి. ఇక ఈ గొడవలో ఓ మీడియా ప్రతినిధిపై మోహన్ బాబు దాడి చేయడం, అతని ఆసుపత్రిలో చేరడం వివాదానికి దారి తీసింది.
దగ్గరవుతున్న అన్నదమ్ములు అయితే ఇప్పుడిప్పుడే మోహన్ బాబు కుటుంబంలో సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారం అవుతున్నట్లుగా వాతావరణం కనిపిస్తోంది. మంచు ఫ్యామిలీ గ్రాండ్‌గా నిర్మించిన కన్నప్పను చూసిన మనోజ్.. తన అన్నయ్యకి, చిత్ర యూనిట్‌కు విషెస్ తెలియజేశాడు. ఆ తర్వాత ఇటీవల తేజ సజ్జా హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో వచ్చిన మిరాయ్‌లో మంచు మనోజ్ నెగిటివ్ రోల్‌లో నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించడంతో పాటు మనోజ్ పాత్రకు మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. దీంతో మనోజ్ సంబరాలు చేసుకుంటున్నాడు. ఈ సినిమా విజయంపై మోహన్ బాబు, విష్ణులు కూడా హ్యాపీగా ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. విష్ణు స్వయంగా మిరాయ్ టీమ్‌ను అభినందించారు. అడ్రస్ లేని మంచు లక్ష్మీ అయితే అన్నదమ్ములు, తండ్రి కొడుకుల గొడవలో మంచు ఫ్యామిలీ ఆడపడుచు, మోహన్ బాబు కుమార్తె లక్ష్మీ ప్రసన్న ఎక్కడా కనిపించకపోవడం అప్పట్లో పలు అనుమానాలకు తావిచ్చింది. హైదరాబాద్ ఫిలింనగర్‌లో ఉన్న మోహన్ బాబు ఇంటిలోనే లక్ష్మీ ప్రసన్న ఉండేవారు. అయితే ఏమైందో కానీ ఆమె ముంబైకి షిఫ్ట్ అయిపోయి.. ఇక్కడ ఏదైనా పని ఉంటేనే హైదరాబాద్‌కు వస్తున్నారు. మరోవైపు.. లక్ష్మీప్రసన్న తీవ్ర ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నారని, ముంబైలో అద్దె ఇంటిలో నివసిస్తున్నారని పుకార్లు వైరల్ అయ్యాయి. దీనిపై తాజాగా తెరదించారు మోహన్ బాబు కుమార్తె. నాకు ఇల్లు లేదు మంచు లక్ష్మీ లీడ్ రోల్‌లో వంశీ కృష్ణ మల్లా దర్శకత్వంలో మోహన్ బాబు నిర్మించిన చిత్రం దక్ష. సెప్టెంబర్ 19న సినిమా విడుదల కానుంది. ఈ మూవీ ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంచు లక్ష్మీ తన ఆర్థిక పరిస్ధితి, కుటుంబంలోని సమస్యలపై కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో ఉంటున్న ఇంటిని లక్ష్మీ అమ్మకానికి పెట్టారని వస్తున్న వార్తలపై యాంకర్ ప్రశ్నించారు. దానికి లక్ష్మీ స్పందిస్తూ.. అందరూ అనుకున్నట్లు నాకు ఇల్లు లేదు, ఇల్లు ఉంటేనే కాదా సేల్ చేయడానికి. ఫిలింనగర్‌లో ఇంట్లో నేను ఉండేదాన్ని అంతే, ఆ ఇల్లు నాది కాదు. నాన్నగారు ఇచ్చారు కాబట్టే ఆ ఇంట్లో ఉండగలిగాను, ఈ ఇంటిపై సర్వహక్కులూ డాడీవే.. నా పేరు మీద ఆ ఇల్లు లేదని లక్ష్మీ స్పష్టం చేశారు. Recommended For You నాని ప్యారడైజ్ విలన్ గా లెజెండరీ యాక్టర్.. మంచు లక్ష్మీ లీక్ రోజువారీ ఖర్చులకు ఇబ్బందే నా రోజువారి ఖర్చులకు కష్టంగానే ఉందని, అద్దె కట్టడం ఛాలెంజ్‌గా ఉందని.. ఎవరూ నన్ను వెళ్లగొట్టలేదని కానీ నేనే స్వతంత్రంగా బతకాలని బయటికొచ్చానని లక్ష్మీ చెప్పారు. హైదరాబాద్‌లో టమోట రూపాయి అయితే ముంబైలో మూడున్నర రూపాయలు, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువే. ఆ ఇబ్బందుల్లో నుంచే ఇంకెంత ఎదుగుతానన్నది చూడాలి. మా నాన్న పెద్ద హీరో అయినా.. నా కాలేజీ చదువుకు కావాల్సిన ఖర్చును పార్ట్‌టైమ్ ఉద్యోగం చేసే సంపాదించుకున్నానని తెలిపారు మంచు లక్ష్మీ. ప్రస్తుతం మంచు లక్ష్మీ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నాకు ఇల్లు లేదు మంచు లక్ష్మీ లీడ్ రోల్‌లో వంశీ కృష్ణ మల్లా దర్శకత్వంలో మోహన్ బాబు నిర్మించిన చిత్రం దక్ష. సెప్టెంబర్ 19న సినిమా విడుదల కానుంది. ఈ మూవీ ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంచు లక్ష్మీ తన ఆర్థిక పరిస్ధితి, కుటుంబంలోని సమస్యలపై కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో ఉంటున్న ఇంటిని లక్ష్మీ అమ్మకానికి పెట్టారని వస్తున్న వార్తలపై యాంకర్ ప్రశ్నించారు. దానికి లక్ష్మీ స్పందిస్తూ.. అందరూ అనుకున్నట్లు నాకు ఇల్లు లేదు, ఇల్లు ఉంటేనే కాదా సేల్ చేయడానికి. ఫిలింనగర్‌లో ఇంట్లో నేను ఉండేదాన్ని అంతే, ఆ ఇల్లు నాది కాదు. నాన్నగారు ఇచ్చారు కాబట్టే ఆ ఇంట్లో ఉండగలిగాను, ఈ ఇంటిపై సర్వహక్కులూ డాడీవే.. నా పేరు మీద ఆ ఇల్లు లేదని లక్ష్మీ స్పష్టం చేశారు.
రోజువారీ ఖర్చులకు ఇబ్బందే నా రోజువారి ఖర్చులకు కష్టంగానే ఉందని, అద్దె కట్టడం ఛాలెంజ్‌గా ఉందని.. ఎవరూ నన్ను వెళ్లగొట్టలేదని కానీ నేనే స్వతంత్రంగా బతకాలని బయటికొచ్చానని లక్ష్మీ చెప్పారు. హైదరాబాద్‌లో టమోట రూపాయి అయితే ముంబైలో మూడున్నర రూపాయలు, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువే. ఆ ఇబ్బందుల్లో నుంచే ఇంకెంత ఎదుగుతానన్నది చూడాలి. మా నాన్న పెద్ద హీరో అయినా.. నా కాలేజీ చదువుకు కావాల్సిన ఖర్చును పార్ట్‌టైమ్ ఉద్యోగం చేసే సంపాదించుకున్నానని తెలిపారు మంచు లక్ష్మీ. ప్రస్తుతం మంచు లక్ష్మీ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

