మైనర్ బాలికపై అన్నదమ్ములు అత్యాచారం… గర్భం దాల్చడంతో సజీవంగా పాతిపెట్టే ప్రయత్నం …

ఒడిశాలో మహిళలపై జరుగుతోన్న దారుణాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా,. జగత్సింగ్‌పూర్ జిల్లాలో ఇద్దరు సోదరులు, మరో యువకుడు కలిసి 15 ఏళ్ల బాలికపై పదే పదే అత్యాచారం చేశారు. బాలిక గర్భం దాల్చడంతో ఆమెను సజీవంగా పాతిపెట్టేందుకు ప్రయత్నించారు. బాధితురాలు తప్పించుకుని తండ్రికి చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఇద్దరు సోదరులను అరెస్టు చేశారు, మూడో నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఇటీవల ఒడిశాలో అత్యాచార ఘటనలు పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది.
హైలైట్:
- మైనర్ బాలికను గర్భవతిని చేసిన కామాంధులు
- మరొకరితో కలిసి సోదరులు పలుసార్లు అత్యాచారం
- అబార్షన్ చేయించుకోకపోతే పాతిపెడతామని వార్నింగ్
మైనర్ బాలికపై పదే పదే లైంగిక దాడికి పాల్పడిన కామాంధులైన ఇద్దరు సోదరులు.. ఆమె గర్భం దాల్చడంతో బతికుండగానే పాతిపెట్టే ప్రయత్నం చేశారు. మానవత్వానికి మాయనిమచ్చ లాంటి ఈ ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. జగత్సింగ్‌పూర్ జిల్లా బనష్బర గ్రామానికి చెందిన ఇద్దరు సోదరులు భాగ్యధర్ దాస్, పంచానన్ దాస్‌లు, మరో యువకుడు టిల్లు కలిసి తమ గ్రామానికి చెందిన ఓ 15 ఏళ్ల బాలికను లొంగదీసుకుని, ఆమెపై పలుసార్లు అత్యాచారం చేశారు. కామాంధుల కారణంగా ఆమె గర్బం దాల్చడంతో తమ నేరాన్ని కప్పిపుచ్చేందుకు బాధితురాలని సజీవంగా సమాధి చేయడానికి యత్నించారు.
వారి నుంచి తప్పించుకున్న బాలిక.. ఇంటికి చేరుకుని జరిగిన విషయం తండ్రికి చెప్పడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో ఇద్దరు సోదరులను అరెస్టు చేసిన పోలీసులు.. పరారీలో ఉన్న మూడో నిందితుడు టిల్లు కోసం గాలిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకా.., బాలికపై ఈ ముగ్గురు నిందితులు పదే పదే అత్యాచారం చేశారు. ఆమె గర్భదాల్చినట్టు తెలియడంతో అబార్షన్ చేయిస్తామని చెప్పి ఓ ప్రదేశానికి రప్పించారు. అక్కడికి చేరుకున్న బాలిక.., ఒక పెద్ద గుంత తవ్వి ఉండటాన్ని గమనించింది. ఆపై భయపెట్టిన నిందితులు.. అబార్షన్ చేయించుకోకపోతే గుంతలో పాతిపెడతామని బెదిరించారని పోలీసులు తెలిపారు.
