రతి కోరికలు పెంచే ఖనిజాలు.. వీటిని పొందితే ప్రతి రాత్రీ స్వర్గమే!


శృంగార కోరికలను పెంచే ఆహారం ఏదో, ఆ ఆహారంలో ఉండే పోషకాలు ఏవో తెలిస్తే, అలాంటి ఆహారం తీసుకోవడం ద్వారా.. ఎనర్జీ లెవెల్స్ పెంచుకోవాలి. అందుకు సంబంధించిన కీలక సమాచారం ఇప్పుడు తెలుసుకోండి.
రాత్రి ఆనందంగా గడిస్తేనే, పగలు యాక్టివ్‌గా ఉంటారు. రోజంతా ఎన్నో పనులు చేసే వారు.. రాత్రి రిలాక్స్ అవుతారు. శృంగారం కూడా జీవితంలో అత్యవసరమే. కాబట్టి.. దాన్ని తేలిగ్గా తీసుకోవడం కరెక్టు కాదు. దంపతులు ఎవరైనా సరే శృంగారంలో పూర్తి ఆనందం పొందాలి. అది వారి హక్కు. అందుకోసం ఎనర్జీ ఇచ్చే ఖనిజాలు ఏవో తెలుసుకోవాలి.
నైట్రోజన్ సంబంధిత నైట్రేట్స్.. ధమనులకు రిలాక్స్ ఇచ్చి, గుండెకు రక్తం బాగా వెళ్లేలా చేస్తాయి. మహిళల్లో నైట్రేట్స్ తక్కువగా ఉంటే, వారిలో సెక్స్ కోరికలు తక్కువగా ఉంటాయి. నైట్రేట్స్.. శృంగారంలో ఆనందాన్ని బాగా పెంచుతాయి. ఫీలింగ్స్ ఎక్కువయ్యేలా చేస్తాయి. మరి ఈ నైట్రేట్స్ ఎందులో ఉంటాయో తెలిస్తే, ఆ ఆహారం తినవచ్చు. నైట్రేట్స్.. బీట్రూట్, పాలకూర, పార్స్లీ, ముల్లంగిలో ఉంటాయి. వీటిని మగవారు కూడా తినడం వల్ల మంచి ఫలితాలుంటాయి.
సెక్స్ హార్మోన్లైన టెస్టోస్టెరాన్, ప్రొజెస్టెరాన్, డోపమైన్, ఎపినెఫ్రైన్ వంటి న్యూరోట్రాన్స్మిటర్ల ద్వారా శృంగారం చెయ్యాలనే కోరికను పెంచడంలో మెగ్నీషియం మరొక అద్భుతమైన ఖనిజం. మీ ఉద్రేకాన్ని పెంచడానికి, మీ రాత్రిని మరింత ఆహ్లాదకరంగా ఉంచటానికి మెగ్నీషియం బాగా పనిచేస్తుంది. కాలే, బచ్చలికూర, బ్రోకలీ వంటి ఆకుకూరలు తీసుకోవడం ద్వారా మీ డోపమైన్ డైట్‌ను పెంచుకోండి.
జింక్ లోపం ఉంటే.. రక్తంలో టెస్టోస్టెరాన్ స్థాయిలు తక్కువగా ఉంటాయి. మీ ఆహారంలో జింక్ లేకపోతే పిల్లలు పుట్టే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అంతేకాదు లైంగిక కోరికలు తగ్గిపోతాయి. అలా కాకుండా మీరు ఆనందకర శృంగారాన్ని కొనసాగించడానికి తప్పనిసరిగా పప్పులు, కాయధాన్యాలు, బీన్స్ వంటి వాటిని ఆహారంలో చేర్చుకోవాలి.
News by : V.L

Minerals that increase sexual desire.. If you get these, every night will be heaven!