Meenakshi Chaudhary: మీనాక్షి చౌదరీ అవుట్‌ఫిట్ చూశారా గురూ..! అందాలతో అదరగొట్టిన యంగ్ లేడీ

యంగ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) ప్రస్తుతం సోషల్ మీడియాలో హవా నడిపిస్తోంది. రీసెంట్ గా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో సక్సెస్ అందుకున్న ఈ బ్యూటీ.. గత కొన్ని రోజులుగా ఆన్ లైన్ మాధ్యమాలపై హల్చల్ చేస్తోంది.
తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్గా దూసుకుపోతుంది మీనాక్షి. గతేడాది ‘ది గోట్’ మూవీలో మెరిసిన ఈ బ్యూటీ, ఆ తర్వాత ‘లక్కీ భాస్కర్’ సినిమాతో లైమ్ లైట్ లోకి వచ్చింది. ఆ వెంటనే సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో హిట్ కొట్టేసింది.
ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం మూవీ, థియేటర్స్‌లో సత్తా చాటింది. దీంతో మీనాక్షి చౌదరి ఫాలోయింగ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. యూత్ ఆడియన్స్ ఆమె అందానికి ఫిదా అయిపోయారు.

ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం మూవీ, థియేటర్స్‌లో సత్తా చాటింది. దీంతో మీనాక్షి చౌదరి ఫాలోయింగ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. యూత్ ఆడియన్స్ ఆమె అందానికి ఫిదా అయిపోయారు.
అనిల్ రావిపూడి రూపొందించిన ఈ సినిమాలో వెంకటేష్ హీరోగా నటించగా.. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. వెంకీ భార్యగా ఐశ్వర్య రాజేష్, లవర్ గా మీనాక్షి చౌదరి తమ నటనతో ప్రేక్షకుల మనసు దోచేశారు.
కాగా, ఈ సినిమా ప్రమోషన్స్ లో మీనాక్షి హైలైట్ అయింది. ఓ మగాడిలో నాకు కావాల్సిన అంశాలు ఇవే అంటూ సిగ్గుపడుతూ చెప్పింది ఈ ముద్దుగుమ్మ. నాలాంటి రూపానికి తగిన అబ్బాయి కావాలి, నాకు సమానంగా మేల్ వెర్షన్ ఉండాలి. ఇలాంటి లక్షణాలు ఉన్న వ్యక్తి దొరికితే వెంటనే పెళ్లి చేసుకొంటాను అని మీనాక్షి చెప్పుకొచ్చింది.

News by : V.L
Meenakshi Chaudhary: Have you seen Meenakshi Chaudhary's outfit, Guru..! The young lady who stunned with her beauty
