వివాహ బంధం … ఆలు మగలు గుర్తుంచుకోవలసిన విషయాలు …

పెద్దలు కుదిర్చిన వివాహ బంధంలో పొరపొచ్చాలు వచ్చి విడిపోవడం నేరం.. అభిప్రాయాలు కలవక, ఒకరి అభిరుచులు ఒకరికి నచ్చక విడాకులు తీసుకోవడం కూడ తప్పే …
వివాహంలో ఎక్కడైతే తప్పు జరిగిందో వాటిని బేరీజు వేసుకుని తమ వివాహ బంధంలో ఉన్న లోపాలను సరిదిద్దుకునే ప్రయత్నం లేదా మన భాగస్వామిలోని లోపాలను మనకు అనుగుణంగా మార్చుకునే ప్రయత్నం చేసినప్పుడు తప్పకుండా ఆ బంధం బలపడుతుంది…
ఇన్ని చేసినా కూడ ఆ బంధం విఫలం అయ్యిందంటే అందులో మన తప్పు కూడా ఉందని గ్రహించాలి…
డబ్బు ఉందనో లేక సంపాదించే శక్తి ఉందనో చిన్న విషయాలకే అమ్మాయైనా అబ్బాయైనా విడాకులు తీసుకుని వెళ్లిపోవడం సరైన నిర్ణయం కాదు….
కనీసం బంధంలో ఒక నిర్ణయం తీసుకోండి, ఒకరినొకరు బాగా అర్ధం చేసుకోవడానికి, ఒకరి అభిప్రాయాలు ఒకరు తెలుసుకోవడానికి కనీసం 10,12 నెలలు సమయం తీసుకోండి, అప్పటి వరకూ పిల్లల గురించి ఆలోచించకపోవడమే మంచిది… పెళ్ళైన కొత్తలో అవతలి వ్యక్తిలో తప్పులేం కనపడవు, రోజులు గడిచే కొద్దీ చిన్న చిన్న విషయాలకే పంతాలు, పట్టింపులు, అహం వచ్చేస్తుంది…. ఒకరి మీద ఒకరికి గౌరవం, ప్రేమ, ఇష్టం తగ్గిపోతుంది… ఈలోగా పిల్లలు పుట్టుకొచ్చేస్తారు…
మీ గొడవల వల్ల ఏ పాపం తెలియని పిల్లల జీవితం నాశనం అవుతుంది…. మీరు హ్యాపీగా విడాకులు తీసుకుంటారు, కానీ మీ పిల్లల భవిష్యత్ ఏంటి, వాళ్ళ మానసిక పరిస్థితి ఏంటనే ఆలోచన ఉండదా..
మళ్ళీ మరొక బంధం కోసం, తోడు కోసం ఆశ పడుతుంటారు… మీ పట్టింపులు, మీ Egos వల్ల పిల్లలు ఎందుకు సఫర్ అవ్వాలి…
ప్లీజ్,… పెళ్లి చేసుకునే ముందే బాగా ఆలోచించి కలిసుండడానికి కారణాలు వెతుక్కోండి, విడిపోవడానికి కాదు…
మన పెద్దవాళ్ళు ఎన్ని గొడవలు వచ్చినా కలిసే ఉన్నారు గానీ చిన్న చిన్న విషయాలకే బంధాలను తెంపుకుని పెళ్లిళ్లు చేసుకోలేదు…
వాళ్ళు అలా కలిసుండడానికి కారణాలు ఏంటని తెలుసుకుని పెళ్లిళ్లు చేసుకుని మీ జీవితాలనే కాదు మీ పిల్లల జీవితాలను కూడా ఆనందమయం చేయండి
News by : P.S.Reddy

